NTV Telugu Site icon

Explosion Sounds In Kerala: ఒక్కసారిగా పేలుడు శబ్దాలు.. ఉలిక్కిపడ్డ గ్రామం

Bomb

Bomb

Explosion Sounds In Kerala: కేరళలోని మలప్పురం జిల్లా అనక్కల్లు ప్రాంతంలో అకస్మాత్తుగా పేలుడు శబ్దాలు వినిపించాయి. దానితో ఆ ప్రాంతంలో తేలికపాటి భూకంపం సంభవించినట్లయింది. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దాంతో 280 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే..

Also Read: Bomb Threat: తిరుపతిలో మళ్లీ కలకలం.. 8 హోటళ్లకు బాంబు బెదిరింపులు

అందిన సమాచారం ప్రకారం.. పేలుడు శబ్దాలు వినడంతో, అక్కడ ఉన్న స్థానిక ప్రజలలో భయాందోళనలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. ముందుజాగ్రత్తగా వారిని తాత్కాలికంగా పాఠశాలకు తరలించామని తెలిపారు. గ్రామంలోని 85 కుటుంబాలకు చెందిన 287 మందిని అర్థరాత్రి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 9:15 గంటలకు మొదటి పెద్ద శబ్దం వినిపించింది. ఆ తర్వాత 10:15కు ఒకసారి, 10:45 గంటలకు మరోసారి శబ్దాలు వినిపించాయి. ఒకటి, రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ శబ్దాలు వినిపించడంతో గ్రామస్తుల్లో భయం, భయాందోళనలు నెలకొన్నాయి.

Also Read: China Launched Shenzhou-19: షెన్‌జౌ-19 అంతరిక్ష యాత్రను ప్రారంభించిన చైనా

సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భద్రతా కారణాల దృష్ట్యా, వారు ఈ కుటుంబాలను రాత్రిపూట సమీపంలోని పాఠశాలకు తరలించారు. బుధవారం ఉదయం గ్రామస్థులు నెమ్మదిగా తమ ఇళ్లకు తిరిగి రావడం ప్రారంభించారని పోలీసు అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఈ పేలుడు శబ్దాలు కారణం స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ ఘటనతో స్థానికుల్లో భయానక వాతావరణం నెలకొంది.