NTV Telugu Site icon

Allahabad High Court: మతమార్పిడిని ఆపకపోతే మెజారిటీ కూడా మైనారిటీగా మారుతుంది.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Allahabad

Allahabad

Allahabad High Court: మతమార్పిడి ఇలాగే కొనసాగితే దేశంలోని మెజారిటీ జనాభా మైనారిటీలుగా మారతారని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఉత్తరప్రదేశ్ అంతటా ఎస్సీ/ఎస్టీ, ఆర్థికంగా పేదవారిని క్రైస్తవ మతంలోకి అక్రమంగా మార్చడం పెద్ద ఎత్తున జరుగుతోందని కోర్టు పేర్కొంది. మత మార్పిడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కైలాష్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఈ వ్యాఖ్య చేశారు.

అసలు కేసు ఏంటంటే.. హామీర్‌పూర్‌కు చెందిన రామ్‌కాలీ ప్రజాపతి అనే మహిళ సోదరుడు రామ్‌పాల్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఢిల్లీలో చికిత్స చేయిస్తానని, వారంలో తిరిగివస్తానని చెప్పి అతడిని కైలాస్ తీసుకెళ్లాడు. తన సోదరుడు రాలేదని రామ్‌కాలీ అతడిని అడగడంతో సరైన జవాబు ఇవ్వలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామస్థులను ఢిల్లీ తీసుకెళ్లి మతమార్పిడి చేస్తున్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు. హమీర్‌పూర్‌లోని మౌదాహా పోలీస్ స్టేషన్‌లో పిటిషనర్ కైలాష్‌పై అక్రమ మత మార్పిడి సెక్షన్ల కింద కేసు నమోదైంది.

Read Also: Nepal: పుష్ప కమల్ దహల్ ప్రచండకు పదవీ గండం.. నేపాల్లో కూలనున్న సంకీర్ణ సర్కార్..?

అలాంటి సమావేశం నిర్వహిస్తున్న సోనూ పాస్టర్ ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యాడు. అదే సమయంలో రాష్ట్రం తరఫున హాజరైన అదనపు అడ్వకేట్ జనరల్ పీకే గిరి మాట్లాడుతూ.. ఇలాంటి సమావేశాలు నిర్వహించడం ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలను క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని అన్నారు. కైలాష్ గ్రామంలోని ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడానికి తీసుకువెళుతున్నారని, ఈ పని కోసం అతనికి చాలా డబ్బులు కూడా చెల్లిస్తు్న్నారని సాక్షులు చెప్పారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉండగా.. కైలాష్‌ తరపున న్యాయవాది వాదిస్తూ.. రామ్‌పాల్‌ను క్రైస్తవ మతంలోకి మార్చలేదని, కేవలం ఢిల్లీకి చికిత్స కోసం మాత్రమే తీసుకెళ్లాడని వాదనలు వినిపించారు.

ఢిల్లీలో గ్రామ ప్రజల మత మార్పిడి
రామ్‌కాలీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె సోదరుడు చాలా కాలం వరకు తిరిగి రాలేదని, కైలాష్‌ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి గ్రామంలోని చాలా మందిని తీసుకెళ్లాడు. ఇక్కడ చాలా మంది మతం మార్చబడింది. అతను క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. ప్రతిఫలంగా రామ్‌కాలీ సోదరుడికి డబ్బులు ఇచ్చారు.

అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రశ్నించిన న్యాయస్థానం
వివిధ ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ సంస్థలలో ఫైర్ ప్రివెన్షన్ అండ్ ఫైర్ సేఫ్టీ యాక్ట్ 2005ని పాటించకపోవడంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై అలహాబాద్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన కోరింది. వివిధ సంస్థలకు నోటీసులు ఇవ్వడమే కాకుండా అగ్నిమాపక శాఖ ఇంతవరకు ఏం చేసిందో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. వివిధ న్యాయ విశ్వవిద్యాలయాల్లోని న్యాయ విద్యార్థులు దాఖలు చేసిన పిల్‌ను విచారిస్తున్న సందర్భంగా బుధవారం ప్రధాన న్యాయమూర్తి అరుణ్ బన్సాలీ, వికాస్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.