Site icon NTV Telugu

GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో బదిలీలు.. 23 మంది డిప్యూటీ కమిషనర్ల పోస్టింగ్ మార్పు..!

Ghmc

Ghmc

GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో విస్తృత స్థాయిలో డిప్యూటీ కమిషనర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 23 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పలువురికి పదోన్నతులు కూడా ఇచ్చి కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు. ఇందులో ఎవరెవరు ఎక్కడి నుండి ఎక్కడికి బదిలీ అయ్యారంటే..

Read Also:MLC Kavitha: తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్.. ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం..!

ఖైరతాబాద్ సర్కిల్‌కు జయంత్‌ ను డిప్యూటీ కమిషనర్‌గా నియమించగా, యూసఫ్‌గూడా డీసీగా రజనీకాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. మల్కాజ్ గిరి డిప్యూటీ కమిషనర్‌ గా జకియా సుల్తానా, చందానగర్‌ కు శశిరేఖ, ఉప్పల్‌ కు రాజును నియమించారు. అలాగే, సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా ఆంజనేయులు, గోషామహల్‌ కు ఉమా ప్రకాష్, రాజేంద్రనగర్‌ కు రవికుమార్, ఎల్బీనగర్‌ కు మల్లికార్జునరావు, హయత్‌ నగర్‌ కు వంశీకృష్ణ బాధ్యతలు చేపడతారు. అలాగే మూసాపేట్ డిప్యూటీ కమిషనర్‌గా సేవా ఇస్లావత్, బేగంపేట్‌ కు డాకు నాయక్‌ను నియమించారు.

Read Also:US Birthright Citizenship: ట్రంప్‌కు షాక్.. జన్మతః పౌరసత్వ హక్కుపై ఆదేశాలకు ఫెడరల్ కోర్టు బ్రేక్‌!

ఈ బదిలీలు, పోస్టింగ్‌లు జీహెచ్ఎంసీ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలుగా కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.

Exit mobile version