GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో బదిలీలు.. 23 మంది డిప్యూటీ కమిషనర్ల పోస్టింగ్ మార్పు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో విస్తృత స్థాయిలో డిప్యూటీ కమిషనర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 23 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పలువురికి పదోన్నతులు కూడా ఇచ్చి కొత్త పోస్టింగ్‌లు కేటాయించారు. ఇందులో ఎవరెవరు ఎక్కడి నుండి ఎక్కడికి బదిలీ అయ్యారంటే..
Read Also:MLC Kavitha: తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్.. ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం..!
Also Read
- Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
- Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
ఖైరతాబాద్ సర్కిల్‌కు జయంత్ ను డిప్యూటీ కమిషనర్‌గా నియమించగా, యూసఫ్‌గూడా డీసీగా రజనీకాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. మల్కాజ్ గిరి డిప్యూటీ కమిషనర్ గా జకియా సుల్తానా, చందానగర్ కు శశిరేఖ, ఉప్పల్ కు రాజును నియమించారు. అలాగే, సికింద్రాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా ఆంజనేయులు, గోషామహల్ కు ఉమా ప్రకాష్, రాజేంద్రనగర్ కు రవికుమార్, ఎల్బీనగర్ కు మల్లికార్జునరావు, హయత్ నగర్ కు వంశీకృష్ణ బాధ్యతలు చేపడతారు. అలాగే మూసాపేట్ డిప్యూటీ కమిషనర్‌గా సేవా ఇస్లావత్, బేగంపేట్ కు డాకు నాయక్‌ను నియమించారు.
Read Also:US Birthright Citizenship: ట్రంప్‌కు షాక్.. జన్మతః పౌరసత్వ హక్కుపై ఆదేశాలకు ఫెడరల్ కోర్టు బ్రేక్!
ఈ బదిలీలు, పోస్టింగ్‌లు జీహెచ్ఎంసీ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకున్న చర్యలుగా కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Putin: జూడోలో బ్లాక్ బెల్ట్.. KGB గూఢచారి.. చివరికి రష్యా అధ్యక్షుడు.. పుతిన్ జీవితం ఆసక్తికరం!
-
Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?