బండి సంజయ్ బండరాం బయటపెడుతానని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సవాల్ విసిరారు. బండి సంజయ్ మీద కరీంనగర్ నుండి మాకు వందలాది కాల్స్ వస్తున్నాయని… బండి సంజయ్ ని ఎంపీ పదవి నుండి దింపే వరకు ఊరుకోనని హెచ్చరించారు.. పూర్తి ఆధారాలతో బండి సంజయ్ పై మీడియా సమావేశం పెడుతానని… తాను భయపడే వ్యక్తి ని కాదు…బయపడితే రాజకీయాల్లో ఉండలేనన్నారు. దళితుల పై దాడి చేశానని అంటున్నారు… తాను ఎక్కడా లేను సిసి టీవీ ఫుటేజ్ చూడాలని చురకలు అంటించారు.. నువు ఒక చంప కొడితే నేను రెండు చెంపలు కొట్టే వాణ్ణి అంటూ బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు మైనంపల్లి హనుమంతరావు..
బండి సంజయ్ కు మైనంపల్లి సవాల్.. బండరాం బయటపెడుతా..!

mynampally hanumantha rao