Site icon NTV Telugu

Main Atal Hoon : ఓటీటీలోకి వచ్చేస్తున్న భారత మాజీ ప్రధాని బయోపిక్..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 03 10 At 4.16.14 Pm

Whatsapp Image 2024 03 10 At 4.16.14 Pm

భారత దేశ మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్‍పేయి జీవితం ఆధారంగా ‘మై అటల్ హూ’ హిందీ చిత్రం తెరకెక్కింది.ఈ బయోపిక్ మూవీ జనవరి 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మోస్తరు వసూళ్లను దక్కించుకున్న ఈ మూవీ లో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి వాజ్‍పేయీ పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రాబోతుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.మై అటల్ హూ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‍ను జీ5 ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. మార్చి 14వ తేదీన ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఈ విషయంపై నేడు (మార్చి 10) అధికారిక ప్రకటన చేసింది.”అద్భుతమైన దార్శనికత, నిర్ణయాలతో దేశానికి కొత్త దిశను అటల్ బిహారీ నిర్దేశించారు. మై అటల్ హూ మార్చి 14న జీ5లో ప్రీమియర్ అవుతుంది” అని జీ5 ప్లాట్‍ఫామ్ ట్వీట్ చేసింది.

మాజీ ప్రధాన మంత్రి, రాజనీతిజ్ఞుడు అందరూ ఎంతో ఇష్టపడే రాజకీయ నేత అయిన అటల్ బిహారీ వాజ్‍పేయి పాలనను, రాజకీయ జీవితాన్ని మే అటల్ హూ చిత్రంలో మేకర్స్ చూపించారు. అలాగే, ఆయన వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సవాళ్లు, కుటుంబం మరియు స్నేహితులతో ఆయన బంధాలను కూడా తెరకెక్కించారు.. పాకిస్థాన్‍తో కార్గిల్ యుద్ధం మరియు పోఖ్రాన్ అణు పరీక్ష సహా చాలా అంశాలు ఇందులో ఉన్నాయి ఈ చిత్రంలో పియూష్ మిశ్రా, రాజా రమేశ్‍కుమార్, దయాశంకర్ పాండే, ప్రమోద్ పాఠక్, పాయల్ నాయర్, రాజేశ్ ఖత్రి, ఎక్లాక్ ఖాన్ మరియి హర్షద్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రవి జాదవ్ దర్శకత్వం వహించగా భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్, లెజెండ్ స్టూడియోస్ పతాకాలపై వినోద్ భానుశాలి, సందీప్ సింగ్ మరియి కమరేశ్ భానుశాలి సంయుక్తంగా నిర్మించారు. అలాగే పాయల్ దేవ్, కైలాశ్ ఖేర్, అమృత్ రాజ్ మరియు మొహంతీ శర్మ సంగీత దర్శకులుగా వ్యవహరించారు.

Exit mobile version