NTV Telugu Site icon

Anti Hijab Protests: మహ్సా అమిని చంపబడలేదు, మరణించింది.. ఇరాన్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Anti Hijab Protests

Anti Hijab Protests

Anti Hijab Protests: ఈ ఏడాది సెప్టెంబరులో ఇరాన్‌లో పోలీసు కస్టడీలో ఉన్న 22 ఏళ్ల మహ్సా అమిని మరణించిన సంగతి తెలిసిందే. మహ్సా అమిని హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె మరణించింది. ఇది జరిగినప్పటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా మహిళలు హిజాబ్ తీసేస్తూ జట్టు కత్తిరించుకుని నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి అలీ బఖేరీ తన ప్రభుత్వాన్ని సమర్థించారు. మహ్సా అమిని చంపబడలేదు అని.. ఆమె మరణించిందని ఆయన ఇరాన్‌ సర్కారును సమర్థించుకున్నారు. ఇలా సమర్థించడం వల్ల పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మహ్సా అమినీ చంపబడలేదు, ఆమె మరణించింది. ఇరాన్‌లో అభివృద్ధికి సంబంధించి కొన్ని పాశ్చాత్య మీడియాలు సృష్టించిన వాతావరణాన్ని చూశాము. ఇరాన్‌ దేశ హక్కులను ఈ పాశ్చాత్య శక్తులు ఉల్లంఘిస్తున్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పాశ్చాత్య శక్తులు ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా లేదా యెమెన్ ప్రజల గురించి మాట్లాడవు. ఆ శక్తులు ఆ దేశాల్లోని చర్యలను ఖండించరని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 13న పోలీసులు నిర్బంధించిన కుర్దిష్-ఇరానియన్ మహిళ మరణం తర్వాత ఇరాన్ ఇటీవలి చరిత్రలో అతిపెద్ద అసమ్మతిని ఎదుర్కొంటోంది.

US Diplomats Drive Auto: బుల్లెట్ ప్రూప్ కార్లు వదిలి.. ఆటో నడిపిన ఫారినర్స్ ఇంతలోనే..

ఇదిలా ఉండగా, ఇరాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. మంగళవారం యూఎన్‌ మానవ హక్కుల కార్యాలయం ఇరాన్‌లో గత వారంలో ఇద్దరు యువకులతో సహా 40 మందికి పైగా మరణించారు. అమిని మరణం తర్వాత శాంతియుత నిరసనల్లో చేరినందుకు ఇరాన్ అంతటా వేలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. నిరసనలకు మద్దతుగా అనేక మంది సెలబ్రిటీలు, క్రీడాకారులు ఆందోళనలు చేపట్టారు. యూఎన్‌ హక్కుల కార్యాలయం ప్రకారం, సెప్టెంబర్ 16న దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగినప్పటి నుంచి 40 మంది పిల్లలతో సహా 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి అనేక మంది భద్రతా దళ సిబ్బంది మరణించినట్లు ఇరాన్ అధికారులు నివేదించారు.