ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా.. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. నవంబర్ 22 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది. ఒకవైపు పెర్త్ టెస్టు మ్యాచ్‌కు సిద్ధమయ్యే పనిలో భారత జట్టు బిజీగా ఉండగా.. మరోవైపు ఈ సీజన్‌లో రంజీ ట్రోఫీలో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ మహిపాల్ లోమ్రోర్ రెచ్చిపోయాడు. ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌పై మహిపాల్ లోమ్రోర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
Lagacharla Incident: లగచర్ల ఘటనపై పరిగి పీఎస్ లో ముగిసిన సమీక్ష..
మహిపాల్ లోమ్రోర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో మొదటి ట్రిపుల్ సెంచరీని సాధించాడు. 253 బంతుల్లో తన డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. అందులో 8 సిక్సర్లు, 18 ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత కూడా అదే దూకుడు బ్యాటింగ్ చేశాడు. దీంతో.. మహిపాల్ 357 బంతుల్లో తన ట్రిపుల్ సెంచరీని పూర్తి చేశాడు. మహిపాల్ 360 బంతుల్లో 13 సిక్సర్లు, 25 ఫోర్ల సాయంతో అజేయంగా 300 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాజస్థాన్ జట్టు 7 వికెట్లకు 660 పరుగులు చేసింది. రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేసిన 43వ ఆటగాడిగా మహిపాల్ లోమ్రోర్ నిలిచాడు. ఈ టోర్నీ చరిత్రలో ఇది 47వ ట్రిపుల్ సెంచరీ. రంజీ ట్రోఫీలో ఓ ఆటగాడు మూడేళ్ల తర్వాత ట్రిపుల్ సెంచరీ సాధించిన ఘనత సాధించాడు. ఈ టోర్నీలో మహిపాల్ లోమ్రోర్ కంటే ముందు ట్రిపుల్ సెంచరీని సర్ఫరాజ్ ఖాన్ నమోదు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ 2020లో ముంబైతో యూపీ తరఫున ఆడుతున్నప్పుడు ఈ ఘనత సాధించాడు. సర్ఫరాజ్ ఖాన్ 391 బంతులను ఎదుర్కొని 301 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Mohammed Shami: కమ్ బ్యాక్‌లో అదరగొట్టిన షమీ.. ఇది కదా కావాల్సింది
రంజీలో ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్లు వీళ్లే..
విజయ్ హజారే, విజయ్ మర్చంట్, గుల్ మహ్మద్, BB నింబాల్కర్, అజిత్ వాడేకర్, సునీల్ గవాస్కర్, అబ్దుల్ అజీమ్, వోర్కేరి రామన్, అర్జన్ కృపాల్ సింగ్, సంజయ్ మంజ్రేకర్, MV శ్రీధర్, రామన్ లాంబా, వసీం జాఫర్, VVS లక్ష్మణ్, దేవాంగ్ గాంధీ, పంకజ్ ధర్మాని, మోంగియా, శివ సుందర్ దాస్, శ్రీకుమార్ నాయర్, అభినవ్ ముకుంద్, ఛెతేశ్వర్ పుజారా, వసీం జాఫర్, సన్నీ సింగ్, రోహిత్ శర్మ, ఆకాశ్ చోప్రా, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, తరువర్ కోహ్లీ, KL రాహుల్, KS భరత్, కరుణ్ నాయర్, స్వప్నిల్ గుగల్లె, రిషబ్ పంత్, సగున్ కామత్, ప్రియాంక్ పంచల్, సమిత్ గోహైల్, ప్రశాంత్ చోప్రా, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, పునీత్ బిష్త్, మనోజ్ తివారీ, సర్ఫరాజ్ ఖాన్, మహిపాల్ లోమ్రోర్.