Site icon NTV Telugu

Maheshwar Reddy : సొంత దుకాణం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు

Maheshwar Reddy

Maheshwar Reddy

మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా సీఎం చెబుతున్నారన్నారు బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి. ఇవాళ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మీడియాతో చిట్‌ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని స్వయంగా రేవంత్ అనుకుంటున్నారన్నారు. పిసిసి పదవీ వేరే.. సిఎం పదవీ వేరే అని, సీఎం పదవి కోసం పది మంది పోటీపడుతున్నారన్నారు మహేశ్వర్‌ రెడ్డి. సెకండ్ పోజిషన్ కోసం కాంగ్రెస్ లో పోటీ పడుస్తున్నారని, భట్టి B ట్యాక్స్ అని కాంగ్రెస్ వాళ్ళే లీకులు ఇచ్చారన్నారు. చంద్రబాబుకు, రేవంత్ కు సేమ్ పోలికలు ఉన్నాయని, ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్, గాంధీ కాంగ్రెస్ మూడు గ్రూపులు ఉన్నాయన్నారు. 25 మందితో తన వర్గం ఎమ్మెల్యేలకు తోడుగా BRS ఎమ్మెల్యేలను తెచ్చుకోవాలని రేవంత్ చూస్తున్నారని, రేవంత్ కు పోటీగా 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఉత్తమ్ కామెంట్ చేశారన్నారు.

అంతేకాకుండా..’సీఎం స్థాయిలో ఉండి కుట్ర చేస్తుందని రేవంత్ అనడం ఆయన అసమర్ధతకు నిదర్శనం. గేట్లు ఓపెన్ చేసినా… విండో లను ఓపెన్ చేసినా ఎవరు కాంగ్రెస్ లోకి వెళ్ళడం లేదన్నారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో కంఫర్ట్ లేదన్నారు. సొంత దుకాణం కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని, టచ్ లో ఉన్నారని.. గేట్లు ఎత్తేమని చెబుతున్నారు కదా ! ఎక్కడ ఎమ్మెల్యేలు..? అని ఆయన వ్యాఖ్యానించారు. మేము గేట్లు ఎత్తే అవసరం లేదన్నారు. ఉప ఎన్నికలు వస్తే హాయ్ శ్రీరామ్ అంటామని, కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు… వాళ్ళ మధ్య విభేదాలే వాళ్ళను వీక్ చేస్తాయని, మా ఎమ్మెల్యేలు ఎవరితో టచ్ లో లేరని ఆయన వ్యాఖ్యానించారు మహేశ్వర్‌ రెడ్డి.

 

బీజేపీ ప్రజలను నమ్ముకుందని, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు.. ప్రభుత్వం కూలిపోతుందని, ముఖ్యమంత్రి వెంట భారీ వ్యవస్థ ఉన్నప్పటికీ కుట్ర జరుగుతుందని రేవంత్ అంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో 5 గురు షిండేలు ఉన్నారని, రేవంత్ రెడ్డి ప్లాన్ A అంటే పార్టీలో ఉంటే నా వెంట ఎంత మంది వస్తారు ? ప్లాన్ B అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా దుకాణం పెట్టుకుంటే ఎంత మంది వస్తారు..? అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ టెన్షన్ తట్టుకొలేక ఒక IPS అధికారి గుండెపోటుతో మరణించారని, భట్టి విక్రమార్క మీద కాంగ్రెస్ లో కుట్ర జరుగుతుందని, యాదగిరి గుట్టలో కింద కూర్చోబెట్టారు.. ఆయన డ్రైవర్ ను కొట్టారన్నారు. సెకండ్ పోజిషన్ నుంచి భట్టి విక్రమార్క ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version