NTV Telugu Site icon

Congress Mahesh Goud : మల్లారెడ్డినీ తక్షణమే మంత్రి వర్గం నుంచి తొలగించి.. విచారణ జరపాలి

Mahesh Goud

Mahesh Goud

TPCC Working President Mahesh Goud Made Comments On Minister Malla Reddy.
చికోటి ప్రవీణ్‌ క్యాసినో వ్యవహారం వెలుగులోకి రావడంతో.. ఇప్పుడు ప్రవీణ్‌ వెనుకున్న బడాబాబుల చీకటి కోణాలు బయటపడుతున్నారు. చికోటి ప్రవీణ్‌తో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలకు సంబంధాలు ఉన్నట్లు బయటకు వస్తున్నాయి. క్యాసినో నిర్వాహకులు చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. పలు కీలక ఆధారాలు సేకరించారు. ఈ ఆధారాల్లో మాధవ రెడ్డి కారుపై మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉండటంతో విపక్షనేతలు మంత్రి మల్లారెడ్డిని టార్గెట్‌ చేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. మల్లారెడ్డి నీ తక్షణ మే మంత్రి వర్గం నుండి తొలగించి.. విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా.. ఈ క్యాసినో వ్యవహారంలో ఐదారుగురు మంత్రులకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. పేకాట ఆడే మంత్రులకు కూడా ప్రవీణ్ తో సంబంధం ఉందని, కేసీఆర్‌ న్యాయ విచారణ చేయించాలన్నారు. డ్రగ్స్ కేసుని కూడా ప్రభుత్వం అటకెక్కించిందని, పబ్బులు విషయంలో కూడా అదే జరిగిందని ఆయన మండిపడ్డారు. ప్రజల్లో హాడావిడి చేసినట్టు భ్రమలు కలిగించి తర్వాత పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.