Mahesh Babu-Rajamouli: రాజమౌళి సినిమా.. మహేశ్ బాబు ఎనిమిది గెటప్స్ రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu’s 8 Look Ready for SS Rajamouli Movie: దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి మహేశ్-రాజమౌళి కాంబోలో ఎప్పుడో సినిమా రావాల్సి ఉండగా.. చాలా లేట్ అయింది. సినిమా లేటుగా వస్తున్నా.. ఇండియన్ సినిమా చూడని సరికొత్త కంటెంట్‌తో వస్తోంది. ఈ మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. అంతేకాదు మహేశ్-రాజమౌళి సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మహేశ్ బాబు గెటప్స్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాల్లో హీరో గెటప్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గెటప్‌ల కోసం హీరోలు రాత్రి పగలు కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే చేస్తున్నారట. ఈ సినిమాకోసం భారీ గడ్డం, పొడవాటి జుట్టును మహేష్ పెంచుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు దృఢంగా కనిపించేందుకు అవసరమైన కసరత్తులు కూడా సూపర్ స్టార్ చేస్తున్నారట. ఇందుకోసం మహేష్ బాబు ప్రతిరోజూ బాగానే కష్టపడుతున్నారట. టాబ్ లుక్ రివీల్ కాకుండా ఉండేందుకే.. మహేష్ ఇటీవల ఎక్కువ పబ్లిక్‌గా కనిపించడం లేదు.
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
Also Read: Breathe OTT: ఓటీటీలోకి నందమూరి హీరో ‘బ్రీత్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మహేశ్ బాబు లుక్‌కు సంబంధించి స్కెచ్‌లు పూర్తయ్యాయని సమాచారం. మొత్తం ఎనిమిది లుక్స్‌ను రాజమౌళి టీమ్ సిద్ధం చేసిందట. కథకు, మహేశ్ ఆహార్యానికి సరిపోయేలా మహేశ్‌ను టెస్ట్ ఫొటో షూట్ చేసి.. ఫైనల్ లుక్‌ను దర్శకదీరుడు ఖరారు చేయనున్నారట. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది. ఈ సినిమా అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగుందని ఇటీవల రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సినిమాకు మహారాజ్ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా వివరాలను రాజమౌళి ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటించే అవకాశం ఉంది. ఆ ప్రెస్‌మీట్ కోసం మహేశ్ బాబు ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!