Site icon NTV Telugu

Mahesh Babu: హ్యాపీ 17మై ఛాంప్! నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.. జూ.ప్రిన్స్ బర్త్ డే

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu:తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి ఈరోజు అంటే ఆగస్టు 31న 17ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు తనయుడికి ట్విట్టర్‌ ద్వారా బర్త్ డే విషెష్ తెలిపారు. ఒక అందమైన పోస్ట్‌ను పంచుకుంటూ “హ్యాపీ 17 మై ఛాంప్ !! నువ్వు వేసే ప్రతీ అడుగు నీ లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్లాలి.. నువ్వు ఆకాశాన్ని, ఆ నక్షత్రాలను అందుకోవాలి.. లవ్యూ సో మచ్ అని పోస్ట్ వేశాడు.” అంటూ ట్వీట్ చేశారు. ఇక గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ అభిమానులు ట్విట్టర్‌లో #HBDPrinceGautam అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ బాబు ట్విట్టర్‌లో షేర్ చేసిన పిక్చర్‌ లో గౌతమ్ చాలా హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడు.

హ్యాపీ హ్యాపీ బర్త్ డే జీజీ. ఇలా ప్రతీ ఏడాది ముందుకు వెళ్తున్న కొద్దీ నువ్వు మమ్మల్ని గర్వపడేలా చేస్తున్నావ్.. ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను.. అంటూ చెప్పుకొచ్చింది నమ్రత.

నువ్వే నాకు ఆధారం, మూలం అన్నయ్య.. నువ్వే నా ప్రపంచం అన్నయ్య.. ఐ లవ్యూ సో మచ్.. హ్యాపీ బర్త్ డే టు బెస్ట్ బ్రదర్ అంటూ సితార పోస్ట్ వేసింది.

మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులకు 2006 ఆగస్టు 31న గౌతమ్ జన్మించాడు. అలాగే మహేష్ బాబు నటించిన “1 నేనొక్కడినే” చిత్రంలో గౌతమ్ తొలిసారిగా నటించాడు. ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Exit mobile version