Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. తను ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరో గా నటించి తెలుగు సినీ పరిశ్రమ లో స్టార్ హీరోగా కెరియర్ కొనసాగిస్తున్నాడు. ఇకపోతే మహేష్ తర్వాత సినిమాను రాజమౌళి తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. రాజమౌళి సినిమా కోసం మహేశ్ సరికొత్త లుక్ లోకి రావడం కోసం ప్రస్తుతం అనేక కసరత్తులు కూడా చేస్తున్నాడు. ఇకపోతే రాజమౌళి సినిమా ద్వారా మహేశ్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉన్నాయి.
Read Also:YS Jagan Punganur Visit Cancelled: వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు.. పెద్దిరెడ్డి ప్రకటన
మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం వారి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేశ్ జుట్టు, గడ్డం, బాడీ పెంచి రెడీ అవుతున్నాడు. దీంతో మహేశ్ ఈ మధ్య ఎప్పుడు కనపడినా లుక్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి మహేశ్ బాబు అదిరిపోయే స్టైలిష్ లుక్ తో కనపడ్డాడు. రెగ్యులర్ గా వెకేషన్ కి విదేశాలకు వెళ్లే మహేశ్ బాబు తాజాగా మరోసారి విదేశాలకు చెక్కేశాడు. అయితే వెకేషన్ కా, అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరికా లేదా రాజమౌళి సినిమా వర్క్ కోసమా అనే వివరాలు మాత్రం తెలియదు. నేడు ఉదయం మహేశ్ – నమ్రత కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లారు. దీంతో మహేశ్ ఎయిర్ పోర్ట్ విజువల్స్ వైరల్ గా మారాయి. మహేశ్ స్టైలిష్ హుడీ వేసుకుని, గాగుల్స్, క్యాప్ పెట్టుకొని రఫ్ గడ్డం, లాంగ్ హెయిర్ తో అదరగొట్టాడు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read Also:Bomb Blast: అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు.. ముగ్గురి మృతి