తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రిలీజ్ భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమాలోని పాటలు బాగా ఫెమస్ అయ్యాయి. అందులో కుర్చీని మడతపెట్టి సాంగ్ బాగా ట్రెండ్ అవుతుంది.. ఈ పాటకు సామాన్యుల నుంచి సెలెబ్రేటిల వరకు అందరూ కూడా రీల్స్ చేస్తున్నారు. మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ని కూడా ఉర్రూతలూగిస్తోంది. ఇటీవల కొందరు ఫారినర్స్ జిమ్ లో ఈ సాంగ్ తో తమ మార్నింగ్ వర్క్ అవుట్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దాని పై మహేష్ కూడా రెస్పాండ్ అయ్యారు…
గతంలో సితార కూడా ఈ పాటకు రీల్స్ చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు రమేష్ బాబు కూతురు కూడా ఈ పాటకు మాస్ స్టెప్పులు వేసింది అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. రమేష్ బాబుకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అబ్బాయి జయకృష్ణ, కూతురు భారతి. సినిమా వర్గాల్లో పెద్దగా కనిపించని ఈ ఇద్దరు వారసులు.. ఆ మధ్య రమేష్ బాబు చనిపోయిన సమయంలో మహేష్ తో కలిసి వీరిద్దరూ ఉన్న ఫోటోలు బాగా వైరల్ అయ్యింది..
ఇక భారతి బాబాయ్ మాస్ పాటకి వేసిన స్టెప్పులు విజుల్స్ వేసేలా ఉన్నాయి. గ్రేస్‌తో ఊరమస్ గా స్టెప్పులు వేసిన భారతి డాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై చెల్లెలు సితార రియాక్ట్ అవుతూ వరుస కామెంట్స్ చేస్తూ వచ్చింది.. తాజాగా ఈ వీడియో పై సితార స్పందించింది.. చాలా బాగా చేసిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది.. ఇన్నాళ్లు సోషల్ మీడియాకి దూరంగా ఉన్న భారతి.. ఇప్పుడు మెల్లిమెల్లిగా యాక్టీవ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అంతేకాదు తన ఇన్‌స్టా బయోలో ఇలా రాసుకొచ్చారు… ఇక త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం..