సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలిసి చేస్తున్న ఎపిక్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ కోసం.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాను షేక్ చేయగా, తాజాగా మూవీ రిలీజ్ డేట్ గురించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించినప్పటికీ, పక్కా డేట్ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ అప్డేట్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు త్వరలోనే ఒక తీపి కబురు అందనుందని సమాచారం.
Also Read : Tamannaah : ఇంటిమేట్ సీన్స్ పై విషయంలో.. స్టార్ హీరో బండారం బయటపెట్టిన తమన్నా.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్‌ను ఈ ఏడాది శ్రీరామనవమి సందర్భంగా అనౌన్స్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అంటే మార్చి 26న ఈ మెగా అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. గ్లోబల్ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ బాబు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
