Varanasi Movie: మహేష్ బాబు అభిమానుల ఉత్సాహం మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం సాయంత్రం మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఈవెంట్ వైభవంగా జరిగింది. ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా మహేష్ బాబు ఎంట్రీ నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే హీరో ఎంట్రీ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. రాజమౌళి-మహేష్ బాబు క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పేరు వారణాసి. ఈవెంట్‌లో ముందుగా రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమా కథను రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం తీసుకొని రూపొందించినట్లు తెలిపారు. ఈ సినిమాలో మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించనున్నారని చెప్పారు. తర్వాత మహేష్ బాబు మాట్లాడుతూ.. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పారు.
READ ALSO: Off The Record: కేసీఆర్ విషయంలో రేవంత్ రివర్స్ వ్యూహం అమలు ?
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత బయటికి వచ్చానని అన్నారు. కొంచెం కొత్తగా ఉందని, కానీ ఇది చాలా బాగుందని అన్నారు. స్టేజ్ మీదకు ఎప్పటి లాగా సింపుల్‌గా నడిచి వస్తాను సర్ అని రాజమౌళితో అంటే కూదరని అన్నారని చెప్పారు. చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో అని అభిమానులతో చెప్పారు. సరే సర్ సింపూల్‌గా గునుగు చొక్కా వేసుకొని వస్తానని అన్నాను, కానీ చూశారుగా ఎలాంటి డ్రెసింగ్ చేశారో అని సరదాగా అభిమానులతో పంచుకున్నారు. అదేంటండి గుండీలు లేవు, ఒక రెండు, మూడు బటన్స్ అయినా పెట్టాలని అంటే, స్టైల్ ఇంతే అన్నారని చెప్పారు. ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మనలేదని సరదాగా చెప్పారు. చొక్కా లేకుండా రమ్మనడం నెక్ట్స్ ఉంటుందేమో అని అన్నారు.
అనంతరం.. సినిమాకు సంబంధించి ఇచ్చిన అప్డేడ్ ఎలా ఉందని అభిమానులు అడిగారు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన సినిమాలోని డైలాగ్ చెప్పారు.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు.. నాన్న గారంటే తనకు ఎంత ఇష్టమో మీఅందరికి తెలుసు. ఆయన చెప్పిన అన్ని మాటలు వినేవాడిని అని, కానీ ఆయన ఎప్పుడు ఒక పౌరాణిక సినిమా చేయాలని చెప్పే వారు. కానీ నేను ఎప్పుడూ ఈ మాట వినలేదు. ఇవ్వాల నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతో ఉంటాయి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతా. ఐ మేక్ ఎవ్రీ వన్ ఫ్రౌడ్, మోస్ట్ ఇంపాటెడ్లీ ఐ మేక్ మై డైరెక్టర్ మోస్ట్ ఫ్రౌడ్ అని అన్నారు. వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం దా హోల్ ఆఫ్ ఇండియా ఫ్రౌడ్ ఆఫ్ హస్ అని అన్నారు. ఇది కేవలం టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే అని, ఫస్ట్ రిలీవింగ్ మాత్రమే అని అన్నారు. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహాకే వదిలేస్తున్నా.. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అని అభిమానులతో చెప్పారు. మీరందరూ ఎంతో దూరం నుంచి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు. థాంక్యూ వెర్రీ మచ్. థాంక్యూ అనేది చాలా చిన్న మాట. నేను ఎప్పుడు మిమ్మల్ని పొగుడుతూ పెద్ద పెద్ద మాటలు చెప్పలేదు. మీరు నాపై చూపించే అభిమానం మాటలతో చెప్పలేను. ఎప్పుడూ అంటాను కదా చేతులెత్తి దండం పెట్టడం తప్పా నాకు ఇంకేం తెలియదు. మేము మా టీం, పోలీసు డిపార్మెంట్ హెల్ప్‌తో ఈవెంట్‌తో సక్సెస్‌పుల్‌గా నిర్వహించామని అన్నారు. అభిమానులందరూ ఇంటికి క్షేమంగా వెళ్లాలని మహేష్ బాబు పిలుపునిచ్చారు.
READ ALSO: Priyanaka Chopra: ఇక తగలబెడదామా.. మందాకిని దూకుడు మాములుగా లేదుగా..!
