Site icon NTV Telugu

Mahesh Babu : అయోధ్య చరిత్రకు సాక్ష్యంగా నిల్వడం గర్వంగా ఉంది : మహేష్ బాబు

Mahesh (3)

Mahesh (3)

భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు యొక్క బాల రాముడి విగ్రహం ను ఈరోజు అయోధ్య లో ఎంతో ఘనంగా ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే.. ఈరోజు ఎక్కడ చూసిన రామ నామస్మరణలతో మారు మోగిపోతుంది.. 12: 29 నిమిషాలకు ప్రధాని మోడీ చేతుల మీదుగా శ్రీరాముడి బాల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు హాజరయ్యారు.. కన్నుల పండుగగా ఈ ప్రతిష్ట జరిగింది..

అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట పై ఘనంగా జరిగింది.. ఈ ప్రతిష్ట పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ప్రస్తుతం విదేశి పర్యటనలో ఉన్న మహేష్ ఈ ప్రతిష్ట పై తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.. తన ట్వీట్‌లో చరిత్ర యొక్క ప్రతిధ్వనులు, విశ్వాసం యొక్క పవిత్రత మధ్య, అయోధ్యలో రామ మందిరాన్ని గొప్పగా ప్రారంభించడం ఐక్యత, ఆధ్యాత్మికతకు శాశ్వతమైన చిహ్నాన్ని తెలియజేస్తుంది. ఇటువంటి చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది. అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు.. ప్రస్తుతం ఆ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఆ సినిమా మేనియా ఇంకా కొనసాగుతుంది.. ఇప్పుడు మరో సినిమాలో నటించబోతున్నారు.. రాజమౌళి దర్శకత్వం లో ఓ సినిమా చెయ్యనున్నారు..

Exit mobile version