సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా డీజే టిల్లు.. ఈరోజు సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. దాంతో సినిమా యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా మంచి విజయాన్ని అందుకుంది.. వన్ మ్యాన్ షోగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను అందుకుంది.. తెలంగాణ స్లాంగ్ లో వచ్చిన ఈ సినిమా లోని ఫేమస్ డైలాగును మహేష్ బాబు చెబితే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడవచ్చు.. టిల్లుగా మారిన మహేష్ బాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈరోజు మధ్య మనోళ్లు టెక్నాలజీని తెగ వాడేస్తూ రకరకాల ఫన్నీ మీమ్స్ ను క్రియేట్ చేస్తున్నారు… ఈ మధ్య ఏఐ ను వాడి వాయిస్ లను కూడా చేంజ్ చేస్తున్నారు. ప్రముఖుల వాయిస్ తో కొన్ని సాంగ్స్ ను చేంజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబుకు సంబందించిన ఓ వీడియో వైరల్ గా మారింది..
ఈ సినిమాలో సిద్దు రాధికా అపార్ట్ మెంట్ కు వెళ్లే సీన్ ను మహేష్ బాబుతో ఎడిట్ చేశారు. సిద్దూ ముఖానికి బదులు మహేష్ బాబు ఫేస్ ను ఎడిట్ చేసి అలాగే ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి మహేష్ బాబు వాయిస్ ను కూడా సెట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు ల విషయానికొస్తే.. గుంటూరు కారం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు..