Site icon NTV Telugu

Khaleja Re-Release: మే 30న థియేటర్స్‌లో పండగే.. ‘ఖలేజా’ ప్రీ సేల్ సక్సెస్ మీట్..!

Khaleja Re Release

Khaleja Re Release

Khaleja Re-Release: దివంగత సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన కుమారుడు మహేష్ బాబు నటించిన చిత్రం ‘ఖలేజా’ మే 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ- రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ సేల్ సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు శింగనమల రమేశ్, సి. కళ్యాణ్, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, ప్రముఖ నటులు అలీ, సునీల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read Also: Mass Jathara: వినాయక చవితికి మాస్ గిఫ్ట్.. థియేటర్లలోకి రవితేజ ‘మాస్ జాతర’..!

ఈ సందర్భంగా ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. పోకిరి సినిమాతో రీ- రిలీజ్ ట్రెండ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఖలేజా కూడా అదే బాటలో ముందుకెళ్తోంది. సుబ్బారావు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఖలేజా రీ- రిలీజ్ వల్ల నిర్మాతలకు మంచి సంతృప్తి లభిస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. అలాగే నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. ఖలేజా సినిమా కోసం మేము ఎంతో కష్టపడ్డాం. త్రివిక్రమ్, మహేష్, నమ్రత కలిసి ఒక టీంలా పనిచేశారు. ఈ చిత్రం టీవీల్లో 1500 సార్లు ప్రదర్శించబడింది. ఇది ఓ రికార్డు. ఇప్పటికీ యూత్ ఈ సినిమాను ఎంతో ఇష్టంగా చూస్తున్నారు. సినిమాలోని ‘సీతారాం’ పాత్ర మహేష్ బాబుకు బాగా దగ్గరగా ఉంటుంది. మే 30న థియేటర్స్‌ బద్దలవుతాయి. ఖలేజా రీ- రిలీజ్ లో ఓ కొత్త రికార్డు సృష్టిస్తుందని అన్నారు. మరో నిర్మాత శింగనమల రమేశ్ మాట్లాడుతూ.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. రీ- రిలీజ్ సందర్భంగా వచ్చిన స్పందన చూస్తుంటే గర్వంగా ఉందని ఆయన తెలిపారు.

Read Also: Gaddar Awards: తగ్గేదేలే.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్‌.. బెస్ట్‌ సినిమాగా కల్కి..!

ఇక సినిమాలో నటించిన ప్రముఖ హాస్యనటుడు అలీ మాట్లాడుతూ.. ఖలేజా సినిమా టీవీల్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఎక్కడికి వెళ్లినా ఖలేజా గురించి మాట్లాడతారు. ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ అయితే బెటర్ అనిపిస్తుంది. సినిమాకు ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మే 30న థియేటర్‌లో కలుద్దాం అని అన్నారు. ఇక ఏసియన్ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారాయణ మాట్లాడుతూ.. ఖలేజా సినిమాకు టికెట్ ఓపెన్ చేసిన కొద్ది సేపటికే సోల్డ్ అవడం చూస్తుంటే, ఇది ఫ్రెష్‌గా రిలీజ్ అయినట్లు అనిపిస్తోంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మోజు ఇంకా తీరలేదని అన్నారు.

Exit mobile version