NTV Telugu Site icon

Mahesh Babu: మహేష్ బాబు న్యూ లుక్ చూసి షాక్ అవుతున్న ఫారినర్స్.. ఎందుకో తెలుసా?

Maheshh

Maheshh

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.. భారతదేశంలో మహేష్ కు ఫ్యాన్స్ ఉన్నారు.. తెలుగు టు హిందీ ప్రజలు ఆయన అందానికి ఫిదా అవుతున్నారు.. ఇక అమ్మాయిల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయానే చెప్తారు.. మహేష్ అంత హ్యాండ్సమ్ గా ఉంటాడు..ప్రస్తుతం ఆయన వయస్సు 48 అయినా.. 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ యంగ్ హీరోలకు సైతం కుళ్లుకోవాల్సిందే అనేట్టుగా ఫిట్‏నెస్ మెయింటెన్ చేస్తున్నారు.. భారీ వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడుతున్నారు.. అంతేకాదు ఎప్పటికప్పుడు న్యూ లుక్ ఫొటోలను ఫ్యాన్స్ కు షేర్ చేస్తారు..

మహేష్ స్టైలీష్ లుక్ లో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నారంటూ ఇప్పటికే ఎంతో మంది కామెంట్స్ చేశారు. ఇక లండన్ వాసులు మహేష్ న్యూలుక్ చూసి ఫిదా అవుతున్నారు. ఆయన వయసును అంచనా వేయడంలో పొరపాటు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుది. ఇటీవల లండన్‌లో వీధుల్లో ఒక భారతీయ వ్యక్తి తన ఫోన్‏లో మహేష్ బాబు లేటేస్ట్ ఫోటో చూపిస్తూ.. ఆయన వయస్సును అంచనా వేయమని ప్రజలను అడిగాడు… అక్కడి వారంతా మహేష్ ను చూసి 20,25 అని చెప్పారు..

ఇక చివరికి అతని వయస్సు చెప్పగానే షాక్ అవుతున్నారు.. అంటే మహేష్ అంత యంగ్ గా కనిపిస్తున్నారు.. ఇకపోతే రోజురోజుకు ఎగ్ తగ్గిస్తున్నారేమో అన్నట్లు యంగ్ గా మారుతున్నారు… అంతేకాదు వరుస సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు..తాజాగా మహేష్ బాబు కొత్త ఫోటో కూడా వైరల్ అవుతుంది. జిమ్ లో వర్కవుట్ చేస్తోన్న ఫోటోను పంచుకున్నారు మహేష్. అందులో సీరియస్ లుక్‏లో స్పోర్ట్స్ టీ షర్ట్ ధరించి, హెడ్‌బ్యాండ్‌ని ఉపయోగించి జుట్టును వెనక్కి తిప్పి కట్టినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం మహేష్ న్యూలుక్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు మహేష్… ఆ తర్వాత రాజమౌళి తో సినిమా చెయ్యనున్నాడు….