‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్ రాజమౌళి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుంటేనే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. జస్ట్ లీక్డ్ వీడియోలతో రచ్చ చేస్తున్నారు. అలాంటిది రాజమౌళి అఫీషియల్ అప్డేట్ ఇస్తే.. సోషల్ మీడియా తగలబడిపోవడం గ్యారెంటీ. కానీ ‘భరత్ అనే నేను’ మూవీ మేకర్స్ మాత్రం మహేష్ ఫ్యాన్స్‌తోనే కామెడీ చేస్తున్నట్టుగా ఉంది వ్యవహారం.
2018లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే ఈ సినిమా రన్ టైం ఎక్కువ అవడంతో కొన్ని సీన్స్‌ను ఎడిటింగ్ టేబుల్ దగ్గరే వదిలేశారు. కానీ సినిమా హిట్ అవడంతో డిలిటేడ్ సీన్స్‌ను యాడ్ చేయాలని అనుకున్నారు. అందులో హోళీ ఫైట్ కూడా ఉంది. కానీ ఇప్పటివరకు ఆ హోళీ ఫైట్ సీన్‌ను మేకర్స్ రిలీజ్ చేయలేదు. మహేష్ ఫ్యాన్స్ కొందరు ఇప్పటికీ ఆ ఫైట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా? అని వెయిట్ చేస్తున్నారు.
Also Read: Champions Trophy 2025: పాక్ మాజీ క్రికెటర్ బెస్ట్ టీమ్.. ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు!
అయితే హోళీ ఫైట్‌ను రిలీజ్ చేయాల్సింది పోయి.. తాజాగా హోళీ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్‌కు కాస్త మండిపోయేలా చేసింది నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్. మరో హోళీ పండుగను కూడా భరత్ అనే నేను మూవీ హోళీ ఫైట్ లేకుండానే సెలబ్రేట్ చేసుకుందామని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్‌తోనే కామెడీ చేస్తున్నారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ హోళీ ఫైట్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండని ఫాన్స్ అంటున్నారు. మరి ఇప్పటికైనా ఆ ఫైట్‌ను బయటికి వదులుతారేమో చూడాలి.