Site icon NTV Telugu

Gunasekhar : మహేష్ బాబు పెద్ద మాయగాడు.. నా కెరీర్ గ్యాప్‌కు కారణం ఇదే

Mahesh Babu Gunashekar

Mahesh Babu Gunashekar

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘వారణాసి’ (Varanasi) తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మహేష్ గురించి గతంలో స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. “మహేష్ బాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి, ఒక్కసారి ఆయనతో సినిమా చేస్తే చాలు.. ఆయన నటనకు, వ్యక్తిత్వానికి అడిక్ట్ అయిపోతాం” అంటూ గుణశేఖర్ సంచలన కామెంట్స్ చేశారు. మహేష్ బాబు ఒక మత్తు లాంటి వ్యక్తి అని, అందుకే తాను వరుసగా ‘ఒక్కడు’, ‘అర్జున్’, ‘సైనికుడు’ వంటి మూడు సినిమాలు ఆయనతోనే చేశానని, అది ఒక రకంగా తాను చేసిన తప్పేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read : Varanasi : ‘వారణాసి’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

గుణశేఖర్ మాటల్లో చెప్పాలంటే.. మహేష్ బాబు దర్శకులను తన నటనతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటారట. డైరెక్టర్ 100 శాతం అడిగితే, మహేష్ 200 శాతం అవుట్‌పుట్ ఇచ్చే ‘మాయగాడు’ అని ఆయన ప్రశంసించారు. వరుసగా ఒకే హీరోతో మూడు సినిమాలు చేయడం వల్ల తన కెరీర్‌లో కొంత గ్యాప్ వచ్చిందని, ఆ మాయలో పడకుండా వేరే హీరోలతో కూడా సినిమా లు చేయాల్సింది అని గుణశేఖర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ లుక్ ఇంటర్నేషనల్ లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న తరుణంలో, ఆయన వర్క్ పట్ల ఉన్న కమిట్‌మెంట్‌ను వివరిస్తూ గుణశేఖర్ చేసిన ఈ పాత వ్యాఖ్యలు అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి.

Exit mobile version