Site icon NTV Telugu

Athidhi Re-release: మహేష్ బాబు ‘అతిథి’ రీ-రిలీజ్.. మణిశర్మ సరికొత్త మ్యాజిక్!

Athidhi Re Release

Athidhi Re Release

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్‌కు ఊపిరి పోసింది సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంటే అతిశయోక్తి కాదు. ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్’, ‘మురారి’ వంటి సినిమాలతో థియేటర్లను షేక్ చేసిన అభిమానులు, ఇప్పుడు ‘అతిథి’ రీ-రిలీజ్ కోసం సిద్ధమవుతున్నారు. 2007లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా, మహేష్ మేకోవర్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లతో అప్పట్లోనే ఒక ట్రెండ్ సెట్ చేసింది.

Also Read : Allu Aravind: మృణాల్‌ నువ్వు ఇక్కడే పెళ్లి చేసుకోని సెటిల్ అవ్వు..

అయితే, ఈ రీ-రిలీజ్ మామూలుగా ఉండబోవట్లేదు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమా కోసం ఒక క్రేజీ ప్లాన్ సిద్ధం చేశారు. ‘అతిథి’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) కోసం ఆయన మళ్ళీ రీ-వర్క్ చేస్తున్నారట. పాత వెర్షన్‌లో ఉన్న స్కోర్‌ను మరింత మెరుగుపరచడమే కాకుండా, కొన్ని కీలక సీన్లకు సరికొత్త మ్యూజిక్ యాడ్ చేస్తున్నట్లు సమాచారం. ఒక పాత సినిమాకు రీ-రిలీజ్ సమయంలో ఇలా మ్యూజిక్ పరంగా కొత్త హంగులు అద్దడం టాలీవుడ్‌లో ఇదే మొదటిసారి కావచ్చు. మహేష్ బాబు స్టైలిష్ లుక్స్, సురేందర్ రెడ్డి టేకింగ్, ఇప్పుడు మణిశర్మ కొత్త బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లలో ‘అతిథి’ విధ్వంసం ఖాయమని తెలుస్తోంది. అప్పట్లో మిస్ అయిన సక్సెస్‌ను ఈ రీ-రిలీజ్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల రూపంలో అందుకోవాలని ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version