NTV Telugu Site icon

Guntur Kaaram: ‘గుంటూరు కారం’కు 23 ఏరియాల్లో బెనిఫిట్ షోలు.. ఫుల్ లిస్ట్ ఇదే!

Guntur Kaaram

Guntur Kaaram

Guntur Kaaram benefit shows list in Telangana: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో గుంటూరులో మంగళవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్ జరిగింది. ఇక ఈ సినిమాకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

గంటూరు కారం సినిమా టికెట్‌ రేట్ల పెంపునకు తెలంగాణ సర్కార్ అంగీకరించింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ. 65, మల్లీఫ్లెక్స్‌లలో రూ. 100 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. జనవరి 12 అర్థరాత్రి ఒంటిగంట నుంచి తెలంగాణలోని 23 ఏరియాల్లో బెనిఫిట్‌ షోల ప్రదర్శనకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల12 నుంచి 18 వరకు ఉదయం నాలుగు గంటల షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చింది. తెలంగాణాలో ఎక్కడెక్కడ గుంటూరు కారం సినిమా బెనిఫిట్ షోలు పడనున్నాయో చూద్దాం.

Also Read: Michael Clarke: అతడు ఓపెనర్‌గా వస్తే.. బ్రియాన్ లారా 400 రికార్డును బద్దలు కొట్టగలడు!

బెనిఫిట్ షో లిస్ట్:
ఏఎంబీ సినిమాస్ (గచ్చిబౌలి)
నెక్సస్ మాల్ (కూకట్‌పల్లి)
భ్రమరాంబ థియేటర్ (కూకట్‌పల్లి)
మల్లికార్జున థియేటర్ (కూకట్‌పల్లి)
అర్జున్ థియేటర్ (కూకట్‌పల్లి)
విశ్వనాథ్ థియేటర్ (కూకట్‌పల్లి)
శ్రీరాములు థియేటర్ (మూసాపేట)
గోకుల్ థియేటర్ (ఎర్రగడ్డ),
సుదర్శన్ 35MM (RTC X రోడ్స్)
ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ( నెక్లెస్ రోడ్)
రాజధాని డీలక్స్ (దిల్‌సుక్ నగర్),
శ్రీ సాయి రామ్ థియేటర్ (మల్కాజిగిరి)
శ్రీప్రేమ థియేటర్ (తుక్కుగూడ)
SVC మల్టీప్లెక్స్ (గజ్వేల్)
మమతా థియేటర్ (కరీంనగర్)
రాధిక థియేటర్ (వరంగల్)
అమృత థియేటర్ (హనుమకొండ)
SVC తిరుమల థియేటర్ (ఖమ్మం)
వినోద థియేటర్ (ఖమ్మం)
నటరాజ్ థియేటర్ (నల్గొండ)
SVC విజయ థియేటర్ (నిజామాబాద్)
వెంకటేశ్వర థియేటర్ (మహబూబ్‌నగర్)
శ్రీనివాస థియేటర్ (మహబూబ్ నగర్)