Site icon NTV Telugu

Mahesh Anand : 5 పెళ్లిళ్లు, 12 ఎఫైర్లు.. చివరకు సోఫాపై కుళ్ళిన శవమైన నటుడు..

Mahesh Anandha

Mahesh Anandha

బాలీవుడ్‌లో ఒకప్పుడు అమితాబ్ బచ్చన్, గోవిందా వంటి స్టార్ హీరోలకు ఎదురుగా విలన్ పాత్రలో మెరిసిన నటుడు మహేష్ ఆనంద్ జీవితం చివరికి అత్యంత విషాదంగా ముగిసింది. 1982లో సినీ ప్రయాణం ప్రారంభించిన ఆయన, సుమారు 300కు పైగా సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. షహన్‌షా, గంగా జమున సరస్వతి లాంటి హిట్ సినిమాలతో పవర్ ఫుల్ విలన్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఒక ఘోరమైన కారు ప్రమాదం ఆయన కెరీర్‌ను ఒక్కసారిగా దెబ్బతీయడంతో పాటు, అవకాశాలు తగ్గిపోవడానికి, ఆర్థిక సమస్యలు పెరగడానికి కారణమైంది. అప్పటి నుంచి ఆయన జీవితం క్రమంగా దిగజారుతూ వచ్చింది.

Also Read : Suma Kanakala : ప్రభాస్, పవన్ కళ్యాణ్‌పై సుమ ఎమోషనల్ కామెంట్స్

వ్యక్తిగత జీవితంలో ఐదు పెళ్లిళ్లు, అనేక అక్రమ సంబంధాలు ఉన్నప్పటికీ, చివరి రోజుల్లో ఆయన పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయారు. 2019లో ముంబైలోని తన ఇంట్లో మహేష్ ఆనంద్ మరణించగా, ఆ విషయం రెండు రోజుల వరకు ఎవరికీ తెలియలేదు. పోలీసులు ఇంటికి వెళ్లినప్పుడు, ఆయన మృతదేహం సోఫాపై కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఇది వెలుగులు, గ్లామర్ కనిపించే సినీ ప్రపంచం వెనుక దాగి ఉన్న భయంకరమైన ఒంటరితనాన్ని, నిర్లక్ష్యాన్ని చూపించే విషాద ఉదాహరణగా నిలిచింది. పేరు, డబ్బు, గుర్తింపు అన్నీ శాశ్వతం కాదని, మనిషికి చివరికి కావాల్సింది మనుషుల అనుబంధమే అన్న కఠిన నిజాన్ని మహేష్ ఆనంద్ జీవితం మరోసారి గుర్తు చేస్తోంది.

Exit mobile version