Site icon NTV Telugu

Ram Charan: శ్రీరాముడిగా రామ్‌చరణ్? మహావతార్ నరసింహ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ram Charan

Ram Charan

Ram Charan: హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై మహావతార్ సినెమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వచ్చిన తొలి మైథలాజికల్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ‘మహావతార్ నరసింహ’ బాక్సాఫీస్ వద్ద హవా కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుంచే అద్భుత రెస్పాన్స్ దక్కించుకున్న ఈ చిత్రం రెండో వీకెండ్‌లో మరింత కలెక్షన్స్ రాబడుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ పెద్ద ఎత్తున నమోదవుతుండటంతో, సినిమా హాళ్ల వద్ద సందడి నెలకొంది.

ఈ విజయం నేపథ్యంలో దర్శకుడు అశ్విన్ కుమార్ కూడా చిత్రానికి మరింత బజ్ తీసుకొచ్చే భాగంగా పోస్ట్-రిలీజ్ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఇకపోతే, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ అశ్విన్ కుమార్. ఒకవేళ ఈ ఫ్రాంచైజీలో లైవ్ యాక్షన్ ఫిల్మ్ తీసే అవకాశం వస్తే.. అందులో శ్రీరాముడిగా ఎవరిని తీసుకుంటారు? అనే ప్రశ్నకు ఆయన నేరుగా రామ్‌చరణ్ పేరును చెప్పుకొచ్చాడు.

Vijay Deverakonda: కింగ్‌డమ్ రెండవ భాగం అద్భుతంగా ఉండబోతుంది!

నిజియానికి సోషల్ మీడియాలో ఇప్పటికే రామ్‌చరణ్‌కి శ్రీరాముడి పాత్రకు భారీ డిమాండ్ ఉంది. డైరెక్టర్ అశ్విన్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వాటికి మరింత అతన్ని ఇచ్చాయి. అయితే, దీనికి కారణం లేకపోలేదు.. ముఖ్యంగా RRR చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ చేసిన క్లైమాక్స్ విజువల్స్ చూసిన తర్వాత, అభిమానులు చరణ్ అచ్చం శ్రీరాముడిలా కనిపించారని అనేకమంది అభిప్రాయపడ్డారు. ఉత్తర భారతదేశంలోని ప్రేక్షకులలో కూడా ఈ పాత్రకు రామ్‌చరణ్‌ను మరింత దగ్గరగా అనిపించారని భావిస్తున్నారు.

ఇప్పటికే మహావతార్ సినెమాటిక్ యూనివర్స్‌కు పునాది పడిపోయిన నేపథ్యంలో.. రాబోయే కాలంలో ఇందులో లైవ్ యాక్షన్ ప్రాజెక్ట్స్ కూడా రానున్నాయన్న అంచనాలు ఉన్నాయి. అందులో భాగంగా రామ్‌చరణ్‌ శ్రీరాముడిగా కనిపించబోతున్నారా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. కాకపోతే ఇది ఇప్పట్లో ఖరారయ్యే విషయం కాదు. కానీ, ఈ చర్చ మాత్రం సోషల్ మీడియాలో నాన్‌స్టాప్‌గా నడుస్తోంది. అభిమానుల ఆశలు, దర్శకుడి ఆసక్తికర అభిప్రాయంతో ఈ బజ్ మరింత పెరిగే అవకాశముంది. రాబోయే రోజుల్లో ఈ విషయంపై మరిన్ని అప్‌డేట్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు.

Tejashwi Yadav: ఓటర్ జాబితాలో తేజస్వి యాదవ్ పేరు గల్లంతు.. ఈసీ తీరుపై మండిపాటు

Exit mobile version