Site icon NTV Telugu

Mahavatar Narasimha Trailer: ట్రైలర్ రిలీజ్.. నరసింహుడి ఉగ్రరూపం చూస్తే గూస్‌బంప్స్ పక్కా..!

Mahavatar Narasimha

Mahavatar Narasimha

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ‘కేజీయఫ్‌’, ‘సలార్‌’ వంటి భారీ యాక్షన్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హోంబలే ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ నుంచి వస్తున్న మొట్టమొదటి యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’. అశ్విన్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 25న 3డీ ఫార్మాట్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

READ MORE: Samsung Galaxy Z Flip 7 FE: పవర్ ఫుల్ ప్రాసెసర్, ఏఐ ఫీచర్లతో.. సామ్ సంగ్ Galaxy Z Flip 7 FE విడుదల..

తాజాగా విడుదలైన ట్రైలర్ అత్యద్భుతంగా ఉంది. హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుడి వరం కోసం ఘోర తపస్సు చేసే సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ కట్టపడేస్తోంది. విష్ణువుపై భక్తితో ప్రహ్లాదుడు, తన నాస్తిక తండ్రి హిరణ్యకశిపుడి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. ప్రహ్లాదుడిని రక్షించడానికి దిగివచ్చిన విష్ణువు అవతారమైన మహావతార్ నరసింహుడి రాకతో ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించింది. ఎపిక్ విజువల్స్, అద్భుతమైన నేపథ్య సంగీతంతో ఈ ట్రైలర్ విజువల్ వండర్ అద్భుతంగా ఉంది. భారతీయ చరిత్రకు సంబంధించిన ఈ ఐకానిక్ కథ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాపై దర్శకుడు అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. “మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ మొట్టమొదటి యానిమేటెడ్ ఫీచర్ ట్రైలర్‌ను ఆయన కృపతో ఆవిష్కరించారు. డివైన్ జర్నీ ప్రారంభమైయింది. క్లీమ్ ప్రొడక్షన్స్ విజన్, ప్రేక్షకుల కోసం న్యూ ఏజ్ మీడియా, స్క్రీన్‌తో భారత్ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాలనే కల సజీవంగా ఉంది” అని వెల్లడించారు.

READ MORE: Samsung Galaxy Watch 8, Watch 8 Classic: సామ్ సంగ్ గెలాక్సీ వాచ్ 8 సిరీస్‌ను విడుదల.. ఫీచర్లకు ఫిదా కావాల్సిందే!

 

Exit mobile version