Site icon NTV Telugu

Hyderabad: హైదరాబాద్ తో మహాత్ముని అనుబంధాలు…!

Untitled 2

Untitled 2

Gandhi Jayanti: భరతమాత బానిస సంకెళ్లను తెంచడానికి నడుంబింగించిన గాంధీజీ దేశం మొత్తం పర్యటించారు. అయన ఉపన్యాసంతో ప్రజలలో చైతన్యం తెచ్చారు. బ్రిటీష్ పరిపాలనను వేళ్ళతో సహా పెకిలించి వేశారు. అలా గాంధీజీ దేశంలో పర్యటిస్తూ హైదరాబాద్ ను కూడా సందర్శించారు. గాంధీజయంతి సందర్భగా హైదరాబాద్ లో ఆయన సందర్శించిన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:Gandhi Jayanti: భారతదేశంలో పర్యటించాలని గాంధీకి సలహా ఇచ్చింది ఎవరో తెలుసా..?

గాంధీ ఏప్రిల్ 7, 1929న కింగ్ కోటి లోని జాంబాగ్‌ లోని వివేక్ వర్ధిని ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ హరిజనుల హక్కులపై బహిరంగ సభలో ప్రసంగించారు. ఇప్పటికి ఆ వేదిక అలాగే ఉంది. పాఠశాల యాజమాన్యం గాంధీ ఫొటోలతో ఫొటో లైబ్రరీని ఏర్పాటు చేసింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతుంది. ఆ సమయంలో మహాత్మాగాంధీ హైదరాబాద్ కి విచ్చేసారు. అయన హైదరాబాద్ లోని బొల్లారంలో ఉన్న లక్ష్మీ రామలింగం ముదలియార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో గాంధీజీ ప్రసంగించారు. కాగా గాంధీజీ ప్రసంగిస్తున్న సమయంలో బ్రిటీష్ పోలీసులు గాంధీజీని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ ఆడిటోరియం శిథిలావస్థకు రావడంతో ప్రభుత్వం ఆ ఆడిటోరియంను ధ్వంసం చేసింది. అయితే స్వాతంత్య్రానంతరం ఆ ప్రదేశంలో ఆడిటోరియంను నిర్మించి గాంధీభవన్‌ అని నామకరణం చేశారు. అందులో గాంధీజీ చిత్రపట్టాన్ని ఉంచారు. గత కొన్నేళ్లుగా ఈ పాఠశాల విద్యార్థులు, సిబ్బంది గాంధీజీ చిత్రపట్టానికి నివాళులు అర్పిస్తున్నారు . ఇంకా హైదరాబాద్ లో ఒక బస్టేషన్ కి మహాత్మా గాంధీ బస్టేషన్ అని పేరు పెట్టారు.

Exit mobile version