NTV Telugu Site icon

Manoj Sinha: మహాత్మాగాంధీ డిగ్రీ చేయలేదు.. జమ్మూకశ్మీర్ గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు

Manoj Sinha

Manoj Sinha

Jammu Kashmir Lieutenant Governor Manoj Sinha: బాపూజీ మహాత్మాగాంధీపై జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ ఎలాంటి డిగ్రీలు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం గ్వాలియర్‌లోని ఐటీఎం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి సిన్హా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా అన్నారు. “చాలా మంది గాంధీజీకి న్యాయశాస్త్రంలో పట్టా ఉందనే అపోహ పడుతుంటారు, కానీ ఇక్కడ నేను చెబుతున్నాను, ఆయనకు ఎటువంటి డిగ్రీ లేదు. గాంధీజీకి హైస్కూల్ డిప్లొమా మాత్రమే ఉంది.” అని మనోజ్‌ సిన్హా అన్నారు. మనోజ్‌ సిన్హా మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. గాంధీజీ మునిమనవడు తుషార్ గాంధీ స్పందిస్తూ.. నిరక్షరాస్యులను గవర్నర్‌లుగా చేస్తే ఫలితం ఉంటుందని అన్నారు.

Read Also: Rahul Gandhi Disqualification: రాహుల్‌ గాంధీ పదేళ్ల క్రితం ఆ ఆర్డినెన్స్‌ను చించకుండా ఉండుంటే..

గురువారం ఐటీఎం యూనివర్సిటీలో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా స్మారకార్థం, ఛాన్సలర్ రామశంకర్ సింగ్ సంపాదకత్వం వహించిన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హాజరయ్యారు. ఇక్కడ పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం సిన్హా తొలుత మహాత్మా గాంధీపై మాట్లాడారు. గాంధీజీ కేవలం హైస్కూల్ డిప్లొమా మాత్రమే చేశారన్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారు నన్ను ప్రశ్నిస్తారు, కాబట్టి నేను పూర్తి వాస్తవాలతో చెబుతున్నాను, దీనికి తన దగ్గర ఆధారం ఉందన్నారు.

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ప్రకటనపై మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ స్పందించారు. నిరక్షరాస్యులను గవర్నర్లుగా చేస్తేనే ఫలితం ఉంటుందన్నారు. ఆయన లా డిగ్రీని కలిగి ఉన్నారన్నారు. మోడీ జీ లాగా పొలిటికల్ సైన్స్‌లో పూర్తి స్థాయి లా డిగ్రీని కలిగి ఉన్నారు. డిగ్రీ నుంచి తన జీవితం వరకు అన్నీ బాపు తన ఆత్మకథలో రాసుకున్నారని అన్నారు. నేను దీని కాపీని మనోజ్ సిన్హాకి పంపుతాను, తద్వారా అతను తన అవగాహన పెంచుకుంటారన్నారు.