Site icon NTV Telugu

Maharashtra: 105కి బదులుగా, 205 రూంకి వెళ్లిన మహిళ.. సామూహిక అత్యాచారం..

Crime

Crime

Maharashtra: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఒక మహిళ తన స్నేహితురాలిని హోటల్‌లో కలిసేందుకు వెళ్లిన సమయంలో సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన ఛత్రపతి శంభాజీ నగర్ లోని ఒక హోటల్‌లో జరిగింది. తాగిన మైకంలో ఉన్న ముగ్గురు ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న 30 ఏళ్ల మహిళ, తన స్నేహితురాలి నుంచి డబ్బు తీసుకునేందుకు హోటల్‌కు వెళ్లింది.

Read Also: Bangladesh Violence: బంగ్లా మిషన్ ముందు ఆందోళన.. 1971ని గుర్తు చేసిన భారతీయులు..

బాధితురాలి స్నేహితురాలు హోటల్‌లోని 105 గదిలో ఉంది. అయితే, తన స్నేహితురాలి గది నుంచి బయటకు వచ్చి తర్వాత, గందరగోళానికి గురైన మహిళ, పొరపాటున రెండో అంతస్తుకు వెళ్లింది. తాను మళ్లీ తన స్నహితురాలి గదికే వచ్చానని భావించి, 205 రూం తలుపు తట్టింది. గదిలో ఘనశ్యామ్ భౌలాల్ రాథోడ్, రుషికేశ్ తులసీరామ్ చవాన్, కిరణ్ లక్ష్మణ్ రాథోడ్ అనే ముగ్గురు వ్యక్తులు మందు పార్టీ చేసుకుంటున్నారు. తలుపు తెరిచి చూడగా, తాను ఎక్కడికి వచ్చానో తెలియక మహిళ గందరగోళంలో కనిపించింది.

నిందితులు, మహిళను గదిలోకి లాక్కెళ్లి బలవంతంగా వారితో పాటు మందు తాగించారు, రాత్రంతా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో ఆమె వారి నుంచి తప్పించుకుంది. గదిలో నుంచి తప్పించుకున్న మహిళ కేకలు వేస్తూ పరిగెత్తుకుంటూ వేదాంత్ నగర్ పోలీస్ స్టేషన్‌‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన మూడు గంటల్లోనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version