Site icon NTV Telugu

Crime News: తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే కడతేర్చాడు..

Crime News

Crime News

Crime News: నవమాసాలు మోసి కనిపెంచిన కుమారుడే తన పాలిట కాలయముడవుతాడని ఆ తల్లి ఊహించలేకపోయింది. పంచప్రాణాలు అతడే అనుకుని బతుకుతున్న ఆ తల్లి తెలుసుకోలేకపోయింది. తన ప్రాణాన్ని తనయుడే తీస్తాడని. వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సింది పోయి.. కన్నతల్లి అనే కనికరం లేకుండా కనిపెంచిన పాపానికి దారుణంగా హత్య చేశాడు. మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగేందుకు ఎక్కడపడితే అక్కడ అప్పులు చేశాడు. మళ్లీ వచ్చి తాగడానికి డబ్బులు కావాలని తన తల్లిని హింసించాడు. ఆమె ఇవ్వకపోవడంతో కన్నతల్లినే కడతేర్చాడు ఆ ప్రబుద్ధుడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

Chicken Theft : పాక్‎లో ఆకలి తట్టుకోలేక కోళ్లను ఎత్తుకెళ్లిన ప్రజలు.. లబోదిబోమంటున్న యజమాని

మద్యం కోసం డబ్బు ఇవ్వడానికి నిరాకరించినందుకు 60 ఏళ్ల మహిళను ఆమె కొడుకు ఆదివారం హత్య చేశాడు. ఈ ఘటన నాగ్‌పూర్‌లోని వందేవి నగర్‌లో చోటుచేసుకుందని, 28 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడు మద్యానికి బానిసై కూలి పనులు చేసేవాడని, వ్యసనం కోసం డబ్బు కోసం తల్లిని నిత్యం హింసించేవాడని పోలీసు అధికారి వెల్లడించారు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చాడు. తన తల్లిని డబ్బులు కావాలని అడిగాడు. ఆమె లేవు అని చెప్పడంతో ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ ఆవేశంలో డబ్బులు ఇవ్వవా అంటూ ఆగ్రహంతో తన తల్లిని కొడవలితో హత్య చేశాడు. కొన్ని గంటల పాటు ఆ ప్రాంతంలో సంచరించిన అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version