NTV Telugu Site icon

Selfie With Monkeys: కోతులతో సెల్ఫీ తీసుకుంటూ 500 అడుగుల లోయలో..

Selfie With Monkeys

Selfie With Monkeys

Selfie With Monkeys: మహారాష్ట్రలో సెల్ఫీ మోజు ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. మహారాష్ట్రలోని వరంధా ఘాట్ రోడ్డులో కోతులతో సెల్ఫీ తీసుకుంటూ 500 అడుగుల లోతైన లోయలో పడి 39 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతుడు అబ్దుల్ షేక్ మృతదేహాన్ని బుధవారం తెల్లవారుజామున వెలికితీసినట్లు అధికారి తెలిపారు.

Madrasa teacher: మదర్సాలో కీచక టీచర్.. విద్యార్థుల అసభ్యకర వీడియోలు తీసి..

తన కారులో కొంకణ్ వైపు వెళుతున్న అబ్దుల్ షేక్, వరంధా ఘాట్ రోడ్డులోని వాఘ్‌జై దేవాలయం దగ్గర ఆగాడు. చుట్టూ కొన్ని కోతులు ఉండగా.. వాటితో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో కాలు జారి 500 అడుగుల లోయలో పడిపోయాడని భోర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విఠల్ దబాడే చెప్పారు. స్థానిక సహ్యాద్రి రెస్క్యూ గ్రూప్ సహాయంతో పోలీసులు మృతదేహాన్ని వాగు నుంచి వెలికితీశారు. అబ్దుల్ ప్రాణాలు కోల్పోవడంతో.. అతడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Show comments