NTV Telugu Site icon

Maharashtra Girder Accident: కుప్పకూలిన గిర్డర్‌ యంత్రం.. 15 మంది మృతి!

Maharashtra Accident

Maharashtra Accident

15 people dead after girder Launching Machine used for bridge construction collapses in Thane: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గిర్డర్‌ యంత్రం కుప్పకూలి 15 మంది కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర థానే జిల్లాలోని షాపూర్‌లో మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ హైవే ఫేస్‌-3 రోడ్డు పనుల్లో భాగంగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

గత కొద్దిరోజులుగా సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే మూడవ దశ నిర్మాణం జరుగ్గుతోంది. రోడ్డు పనుల్లో భాగంగా థానేలోని సర్లాంబే గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం జరుగుతుండగా.. పిల్లర్లతో అనుసంధానించే గిర్డర్‌ యంత్రం ఒక్కసారిగా కుప్పకూలి కార్మికులపై పడింది. దీంతో 15 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. 100 అడుగుల ఎత్తు నుంచి గిర్డర్‌ యంత్రం పడిపోయినట్లు సమాచారం తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనను షాపూర్‌ పోలీసులు ధ్రువీకరించారు.

Also Read: Off The Record: అధికార పార్టీ ఎమ్మెల్యేలకు.. పగవాడికి కూడా రాకూడని కష్టం..?

Show comments