NTV Telugu Site icon

Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ.. లోక్ సభ ఫ్లోర్ లీడర్ మార్పు

Cm Eknath Shinde

Cm Eknath Shinde

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తాకింది. ఇన్నాళ్లు ఎమ్మెల్యేలే షిండే వర్గంలో ఉన్నారనుకుంటే తాజాగా ఎంపీలు కూడా సీఎం ఏక్ నాథ్ షిండేకు మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా లోక్ సభలో శివసేన నేత రాముల్ షెవాలేను శివసేన నాయకుడిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గుర్తించారని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే మంగళవారం వెల్లడించారు. దివంగత బాలా సాహెబ్ ఠాక్రే ఆదర్శాలను నిలబెట్టాలనే శివసేన ఎంపీలు తమకు మద్దతు ప్రకటించారని ఆయన అన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిని మార్చాలని స్పీకర్ ఓం బిర్లాకు శివసేనకు సంబంధించిన 12 మంది సభ్యులు లేఖ రాశారు. వీరంతా ఏక్ నాథ్ షిండే వెంట ఉన్నారు.

లోక్ సభలో శివసేనకు మొత్తం 19 మంది ఎంపీలు ఉండగా.. వారిలోె 12 మంది షిండే వర్గానికి మద్దతుగా నిలిచారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కుమారుడితో పాటు మొత్తం 12 మంది పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ ను మార్చాలని లేఖ రాశారు. అయితే ఈ ఘటనకు ముందు శివసేన ఫ్లోర్ లీడర్ గా ఉన్న వినాయక్ రౌత్ స్పీకర్ ను కలిసి.. షిండే వర్గం నుంచి ఎలాంటి అభ్యర్థన తీసుకోవద్దని కోరారు. తాాజాగా మెజారిటీ వర్గం ఎంపీలు వినాయక్ రౌత్ స్థానంలో రాహుల్ షెవాలేను నియమించాలని కోరడంతో స్పీకర్ లోక్ సభలో శివసేన ఫ్లోర్ లీడర్ ను మార్చారు.

Read Also: UK Heatwave: బ్రిటన్ లో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. అల్లాడుతున్న ప్రజలు.. రైళ్లు బంద్

శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఆధ్వర్యంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని ఏక్ నాథ్ షిండే వర్గం గౌహతిలో క్యాంప్ ఏర్పాటు చేసింది. దీంతో మహారాష్ట్రలో పాటు దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. శివసేన 56 ఎమ్మెల్యేల్లో 40కి పైగా ఎమ్మెల్యేలు ఇప్పుడు సీఎం ఏక్ నాథ్ షిండే వర్గంలో ఉన్నారు. మెజారిటీ వర్గం ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే క్యాంపులో ఉండటంతో బీజేపీ, శివసేన సంకీర్ణ సర్కార్ లో ఆయన సీఎం పదవి చేపట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతును కోల్పోయారు మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే.