Car Accident: ఆడి కారుతో ఢీకొట్టి పరారీలోకి వెళ్లిపోయిన బీజేపీ అధ్యక్షుడి కుమారుడు..
- మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘటన.
- ఆడి కారులో వెళ్తున్న వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న పలువురిని ఢీకొట్టి పారిపోయారు.
- కారు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కుమారుడు సంకేత్ బవాన్ కులేకు చెందినది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Accident: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆడి కారులో వెళ్తున్న వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న పలువురిని ఢీకొట్టి పారిపోయారు. ఆ ఆడి కారు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కుమారుడు సంకేత్ బవాన్ కులేకు చెందినది. నగరంలోని రామ్‌దాస్‌పేత్ ప్రాంతంలో తెల్లవారుజామున 1 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆడి మొదట ఒక వ్యక్తిని ఢీకొట్టింది. ఆపై పోలో కారు, మోపెడ్ ను ఢీకొట్టింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఘటనకు సంబంధిచి ఇప్పటికి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.
Devara : ఓవర్సీస్ లో దేవర దండయాత్ర.. ఆచార్య ఫుల్ రన్ అవుట్..
Also Read
- Campbell Thomson: "ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో".. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రయాణిస్తున్న అర్జున్ హవారే, రోనిత్ చింతన్‌వార్లు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. బవాన్‌కులేతో పాటు మరో ముగ్గురు కారు రైడర్లు పరారీలో ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో బవాన్‌కులే సహా మొత్తం 5 మంది ప్రయాణిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో నిందితులు ధరంపేత్ లోని బార్ నుంచి తిరిగి వస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు ఆడి ఢీకొన్న పోలో కారు ఆడిని వెంబడించి ఆపింది. ఈ ఘటనలో గాయపడిన జితేంద్ర సోనకంబ్లే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలో కారు డ్రైవర్లు హవారే, చింతన్‌వార్ లను ఆపి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని, మరో ముగ్గురు పారిపోయారని అతను చెప్పాడు. సోన్ కాంబ్లే ఫిర్యాదు మేరకు పోలీసులు ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో పాటు ఇతర నేరాల కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి హౌరే, చింతన్‌వార్ లు బెయిల్ పై విడుదలయ్యారు.
T20 World Cup: ఖాతా తెరవని ఆరుగురు బ్యాటర్లు.. 13 బంతుల్లోనే విజయం! టీ20ల్లో అత్యంత చెత్త టీమ్ ఇదే
ఈ ఘటన పై మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బవాన్‌కులే మీడియాతో మాట్లాడుతూ.., “ఆ కారు నా కొడుకు పేరు మీద ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు నిష్పక్షపాతంగా, క్షుణ్ణంగా విచారణ జరపాలి. ఎవరిపైనా వివక్ష చూపకూడదు. దోషులుగా ఉన్న వారిపై కేసులు పెట్టాలి.” ఏ పోలీసు అధికారితో మాట్లాడినా న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నా లేదా మరెవరైనా సరే అని అన్నారు.
తాజావార్తలు
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్‌ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్‌లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!