NTV Telugu Site icon

Car Accident: ఆడి కారుతో ఢీకొట్టి పరారీలోకి వెళ్లిపోయిన బీజేపీ అధ్యక్షుడి కుమారుడు..

Car

Car

Car Accident: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆడి కారులో వెళ్తున్న వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న పలువురిని ఢీకొట్టి పారిపోయారు. ఆ ఆడి కారు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కుమారుడు సంకేత్ బవాన్‌ కులేకు చెందినది. నగరంలోని రామ్‌దాస్‌పేత్ ప్రాంతంలో తెల్లవారుజామున 1 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆడి మొదట ఒక వ్యక్తిని ఢీకొట్టింది. ఆపై పోలో కారు, మోపెడ్‌ ను ఢీకొట్టింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఘటనకు సంబంధిచి ఇప్పటికి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

Devara : ఓవర్సీస్ లో దేవర దండయాత్ర.. ఆచార్య ఫుల్ రన్ అవుట్..

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రయాణిస్తున్న అర్జున్ హవారే, రోనిత్ చింతన్‌వార్లు మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. బవాన్‌కులేతో పాటు మరో ముగ్గురు కారు రైడర్లు పరారీలో ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో బవాన్‌కులే సహా మొత్తం 5 మంది ప్రయాణిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో నిందితులు ధరంపేత్‌ లోని బార్ నుంచి తిరిగి వస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు ఆడి ఢీకొన్న పోలో కారు ఆడిని వెంబడించి ఆపింది. ఈ ఘటనలో గాయపడిన జితేంద్ర సోనకంబ్లే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలో కారు డ్రైవర్లు హవారే, చింతన్‌వార్‌ లను ఆపి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని, మరో ముగ్గురు పారిపోయారని అతను చెప్పాడు. సోన్‌ కాంబ్లే ఫిర్యాదు మేరకు పోలీసులు ర్యాష్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో పాటు ఇతర నేరాల కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి హౌరే, చింతన్‌వార్‌ లు బెయిల్‌ పై విడుదలయ్యారు.

T20 World Cup: ఖాతా తెరవని ఆరుగురు బ్యాటర్లు.. 13 బంతుల్లోనే విజయం! టీ20ల్లో అత్యంత చెత్త టీమ్ ఇదే

ఈ ఘటన పై మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బవాన్‌కులే మీడియాతో మాట్లాడుతూ.., “ఆ కారు నా కొడుకు పేరు మీద ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు నిష్పక్షపాతంగా, క్షుణ్ణంగా విచారణ జరపాలి. ఎవరిపైనా వివక్ష చూపకూడదు. దోషులుగా ఉన్న వారిపై కేసులు పెట్టాలి.” ఏ పోలీసు అధికారితో మాట్లాడినా న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నా లేదా మరెవరైనా సరే అని అన్నారు.