NTV Telugu Site icon

Mahakumbh: కుంభమేళా స్టార్ట్స్.. అందంతో మోనాలిసా, వేప పుల్లలమ్మి ఫేమస్ అయిన ఆకాశ్

Akash Yadav Maha Kumbh

Akash Yadav Maha Kumbh

మహా కుంభమేళాలో ఎంతో మంది పేదలు.. లక్షాధికారులు అయ్యారు. ఇంకొదరు ఫేమస్ అయ్యారు. ఎవరో తెలియని వ్యక్తులను మహా కుంభమేళా వారి జీవితాలనే మార్చేసింది. కుంభమేళా వారిని సోషల్ మీడియా ద్వారా స్టార్లను చేసింది. అందులో హర్ష రిచారియా, ఐఐటీ బాబా, మోనాలిసా వంటి వారు మనకు తెలిసిందే.. అయితే వీరు కాకుండా మరొకరు ఉన్నారు. అతనే తన ప్రియురాలి కోసం వేప పుల్లలు అమ్మిన ఆకాష్ యాదవ్. యూపీలోని జౌన్‌పూర్‌ ప్రాంతానికి చెందిన ఆకాష్ యాదవ్ మహా కుంభంలో వేప పుల్లలు అమ్మి ఇప్పుడు స్టార్ అయ్యాడు. సోనీ టీవీ తన ప్రసిద్ధ షో “డాన్స్ కా మహాముకబల” కార్యక్రమానికి ఆకాష్‌ను ఆహ్వానించింది. జౌన్‌పూర్‌ నుండి వచ్చిన ఆకాష్.. అతని మాటలు, ప్రతిభతో మిథున్ చక్రవర్తి నుండి మలైకా అరోరా వరకు అందరినీ ఆశ్చర్యపరిచాడు. మడియాహు నుండి మహాకుంభ్ వరకు.. తాజాగా సోనీ టీవీలోని ఓ షోకు ఆకాష్ యాదవ్ హాజరవ్వడం ఆసక్తికరంగా ఉంటుంది.

Read Also: Duddilla Sridhar Babu : రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు

19 ఏళ్ల ఆకాష్ మహా కుంభమేళాలో వేప పుల్లలు అమ్మి లక్షల్లో సంపాదించాడు. వేప పుల్లలతో మహాకుంభ్‌కు వచ్చిన ఆకాష్.. మొదటి రాత్రిలోనే రూ.12,000 సంపాదించాడు. ఆ రోజంతా అతను రూ.30,000 రూపాయలకు పైగా సంపాదించాడు. డాన్స్ కా మహాముకబల వేదికపై ఆకాష్ తన అనుభవాలను పంచుకున్నాడు. “ఇంట్లో నిరుద్యోగిగా కూర్చున్నా, నాన్న ముంబైకి రమ్మని చెప్పాడు. అక్కడ ఏదొక పని చేయమని సూచించాడు. నా ప్రియురాలితో ముంబై వెళ్ళిపోతున్నాను అని చెప్పినప్పుడు, ఆమె ఏడ్చింది. ఆమె నాకు మహాకుంభ్‌కు వెళ్లి ఏదొక వ్యాపారం చేయమని చెప్పింది,” అని ఆకాష్ తెలిపాడు.

Read Also: HYDRA : ప్లాట్‌ కొంటున్నారా.. హైడ్రా సూచనలు తెలుసుకోండి

ఆకాష్ తన ప్రియురాలి సలహా విని వేప టూత్‌పిక్ తో మహాకుంభ్ కు వెళ్లాడు. మొదటి రాత్రిలోనే రూ.12,000 నుంచి రూ.13,000 విలువైన టూత్ స్టిక్స్ అమ్మాడు. ఐదు నుంచి ఆరు రోజుల్లోనే, అతను రూ.35,000 నుండి రూ.40,000 సంపాదించాడు. ఈ సంపాదనతో అతను కొత్త మొబైల్ కొనుగోలు చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్‌కి బట్టలు, అమ్మకి చీర కొనిచ్చాడు. కాగా.. 40,000 రూపాయలు సంపాదించిన అతని వ్యాపారం గురించి విన్న “డాన్స్ కా మహాముకబల” వేదికపై ఉన్న నటులు, కొరియోగ్రాఫర్లు, ఇతర డ్యాన్స్ పార్టిసిపెంట్స్ ఆశ్చర్యపోయారు. ” ఇప్పుడున్న సమాజంలో నాకు నమ్మకమైన అమ్మాయి దొరికింది. ఇంతకంటే ఏమి కావాలి?” అని ఆకాష్ చెప్పాడు. “నేటి కాలంలో అమ్మాయిలు తమ భర్తలను మోసం చేస్తున్నారు, కానీ నా ప్రియురాలు నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది.” అని ఆకాష్ తెలిపాడు.