Mahadev Betting APP owner allegations on Chhattisgarh CM Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌పై మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్ సుభమ్ సోని సంచలన ఆరోపణలు చేశాడు. సీఎం భూపేశ్ తనను ప్రోత్సాహించడంతోనే బెట్టింగ్ యాప్ రూపొందించానని, తాను ముఖ్యమంత్రి సహాయకులకు ఇప్పటివరకు రూ. 508 కోట్లు చెల్లించినట్లు తెలిపాడు. భిలాయ్‌లో తన సహచరులు అరెస్టైన సమయంలో సీఎం భూపేశ్ తనని దుబాయ్‌కి పారిపోవాలని సలహా ఇచ్చినట్లు ఓ వీడియోలో చెప్పాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీజేపీ పేరుతో ఉన్న ఓ ఎక్స్ ఖాతాలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్ సుభమ్ సోని మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలో సుభమ్ సోని మాట్లాడుతూ… తాను మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్ అని చెప్పి డాకుమెంట్, పాస్ పోర్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డులను చూపించాడు. ‘2021లో ఈ బెట్టింగ్ యాప్ తయారు చేశాను. చిన్నగా మొదలెట్టిన ఈ ఆప్ ద్వారా బాగా సంపాదించా. నా లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. భిలాయ్‌లో నా సహచరులు అరెస్టైన సమయంలో సీఎం భూపేశ్ బఘేల్ దుబాయ్‌కి పారిపోమ్మని చెప్పాడు. సెప్టెంబర్ 2022లో దుబాయ్ వచ్చా. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 508 కోట్లు ఇచ్చాను’ అని సుభమ్ సోని వీడియోలో చెప్పాడు.
సీఎం భూపేశ్ బఘేల్‌పై మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్ సుభమ్ సోని ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల వేళ అందరి దృష్టి సీఎంపై మళ్లింది. అయితే తనపై శుభమ్ సోని చేసిన ఆరోపణలను సీఎం భూపేశ్ ఖండించారు. ఇందులో ఎలాంటి నిజం లేదని, ఎన్నికల వేళ తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. తానూ భారత్ వచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని సుభమ్ సోని కోరిన నేపథ్యంలో ఇండియన్ గోవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
“मैं हूं महादेव बेटिंग ऐप का मालिक, भूपेश बघेल के कहने पर दुबई गया और मैंने अब तक 508 करोड़ रुपये दिए हैं!”
महादेव बेटिंग एप मामले में छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल पूरी तरह लिप्त हैं। एप के मालिक शुभम सोनी ने दुबई से वीडियो जारी कर बताई सारी सच्चाई। pic.twitter.com/br5B4ODfj6
— BJP (@BJP4India) November 5, 2023