NTV Telugu Site icon

Mahadev Betting App Case: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్

Shahil Khan

Shahil Khan

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ స్కామ్ కేసులో బాలీవుడ్‌ నటుడు, ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ సాహిల్‌ ఖాన్‌ ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్‌ విభాగానికి చెందిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ను ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేసింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. కాగా, సాహిల్‌కు సిట్‌ 2023 డిసెంబరులోనే నోటీసులు ఇచ్చింది. కానీ, ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఒక సెలెబ్రిటీగా తాను కేవలం ఆ యాప్‌కు బ్రాండ్‌ ప్రమోటర్‌గా మాత్రమే పని చేశానంటూ వెల్లడించారు. ఈ మేరకు 2022 ఫిబ్రవరిలో ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు. యాప్‌ ద్వారా జరిగే కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో తెలిపారు. కానీ, పోలీసులు మాత్రం ఆయన్ని బెట్టింగ్‌ యాప్‌ సహ-యజమానిగా చెప్పుకొచ్చారు.

Read Also: Kenya Floods : కెన్యాలో వరదల విధ్వంసం.. 70 మంది మృతి.. భారీ వర్ష సూచన

ఇక, సాహిల్‌ ఖాన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు బెయిల్‌ను నిరాకరించింది. బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలన్నీ అక్రమం.. పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారాయని తెలిపింది. నకిలీ బ్యాంకు ఖాతాలను సృష్టించి.. ఫేక్‌ సిమ్‌ కార్డులతో సంప్రదింపులు చేసినట్లు గుర్తించారు.. మీకు ‘ది లయన్‌ బుక్‌247’తో నేరుగా సంబంధం ఉన్నట్లు తేలిందని ధర్మాసనం చెప్పింది. అయితే, పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన సాహిల్‌.. ‘స్టైల్‌’, ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఆయన పని చేస్తున్నారు. సొంతంగా ఓ కంపెనీని ఏర్పాటు చేసుకుని ఫిట్‌నెస్‌ సప్లిమెంట్స్‌ను విక్రయిస్తున్నారు.

Read Also: Dulam Nageswara Rao: దూలం నాగేశ్వరరావుకు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన చిన్న కోడలు..

అయితే, ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ద్వారా దాదాపు 15,000 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు సంస్థ గుర్తించింది. దాదాపు 67 బెట్టింగ్‌ వెబ్‌సైట్లు, యాప్‌లను సృష్టించి క్రికెట్‌, ఫుట్‌బాల్, తీన్‌ పత్తీ లాంటి గేమ్స్ లో బెట్టింగ్‌/గ్యాంబ్లింగ్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఇందులోకి సామాన్యులను ఆకర్షించేందుకు సెలబ్రిటీలతో ప్రమోట్‌ చేయించినట్లు ఆరోపించారు. దీనిపై సామాజిక కార్యకర్త ప్రకాశ్‌ బంకర్‌ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో గత ఏడాది నవంబరులో మాతుంగ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయబడింది.