Site icon NTV Telugu

Porika Balram Naik: కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్కు మాతృ వియోగం.. సంతాపం తెలిపిన సీఎం

Balram Naik

Balram Naik

మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తల్లి లక్ష్మీ బాయి అనారోగ్యంతో కన్నుమూశారు. హన్మకొండలో ఓ ప్రయివేట్ చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందింది. బలరాం నాయక్ స్వస్థలం ములుగు జిల్లా మదనపల్లి గ్రామం. బలరాం నాయక్.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేస్తున్నారు. మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాగా.. గతంలో బలరాం నాయక్ కేంద్రమంత్రిగా పని చేశారు. 2012 అక్టోబరులో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. బలరాం నాయక్ తల్లి మరణం పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్ర సంతాపం తెలుపుతున్నారు.

Telangana: ఆ రెండు జిల్లాల జొన్న రైతులకు గుడ్న్యూస్.. క్వింటాళ్ల పరిమితి పెంపు

మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ తల్లి లక్ష్మి బాయి మృతి ప‌ట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన లక్ష్మి బాయి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Exit mobile version