Site icon NTV Telugu

Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ రాజకీయ నేపథ్యం.. పూర్తి వివరాలు ఇవే

Maganti Gopinath

Maganti Gopinath

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కాసేపటి క్రితం కన్నుమూశారు. మాగంటి రాజకీయాల్లోకి రాకముందు సినీ నిర్మాతగా నాలుగు చిత్రాలు నిర్మించారు. అదృష్టం కలిసిరాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ ప్రొడ్యూసర్ గా సక్సెస్ కాలేకపోయిన ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మాగంటి గోపీనాథ్ రాజకీయ నేపథ్యం, కుటుంబ వివరాలు చూసినట్లైతే..

Also Read:Jayashankar Bhupalpally: గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు జన్మించారు మాగంటి గోపినాధ్. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌ గా పనిచేశారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశారు.

Also Read:Balakrishna : ‘అఖండ 2’ బిగ్ అప్డేట్‌కు ముహూర్తం ఫిక్స్..

2014 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తరువాత టిఆర్ఎస్ లో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డి పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018 శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా పని చేశారు.

Also Read:GHMC Mayor: మేయర్ గద్వాల విజయలక్ష్మీకి ఫోన్లో వేధింపులు..

జనవరి 26 2022న బిఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ (BRS) గా మారిన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. గోపీనాథ్ మూడోసారి ప్రఖ్యాత క్రికెటర్ మహ్మద్ అజరుద్దీన్ పై 16.337 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం అందరినీ ఆశ్చర్యపరచింది. అలా జూబ్లీ హిల్స్ నియోజక వర్గంలో ‘హ్యాట్రిక్’ సాధించిన తొలి నాయకునిగా గోపీనాథ్ చరిత్రలో నిలిచారు. గోపీనాథ్ కు భార్య సునీత, కొడుకు వాత్సల్యనాథ్, కూతుళ్ళు దివ్య అక్షరనాగ్, దిశిర ఉన్నారు.

Exit mobile version