విశ్వంలోని ఇతర గ్రహాలపై మానవ మనుగడ కోసం ప్రయోగాలు చేస్తున్న వేళ.. భూమిపై మాత్రం ఇప్పటి వరకు విద్యుత్ సరఫరా లేని గ్రామాలు ఉండడం ఆశ్చర్యం కలిగించకమానదు. కారణాలు ఏవైనా ఇంకా చీకటిలోనే గ్రామాలు మగ్గుతున్నాయి. అయితే ఇటీవలి కాలంలో కరెంట్ సదుపాయం లేని గ్రామాలకు విద్యుత్ ను ఏర్పాటు చేసి వెలుగులు నింపుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామానికి తొలిసారిగా విద్యుత్ వచ్చింది.
Also Read:Bihar: బీహార్ ఓటర్ల జాబితా నుంచి 52 లక్షలకు పైగా పేర్లు తొలగింపు..
విద్యుత్ వెలుగులు ఆ గ్రామంలోని చీకటిని పారద్రోలాయి. విద్యుత్ కాంతులతో గ్రామానికి కొత్త శోభ సంతరించుకుంది. దశాబ్దాల కాలంగా చీకట్లో మగ్గిన ఆ గ్రామంలో నివసించే గిరిజనులు తొలిసారి విద్యుత్ వెలుగులు చూసి మురిసిపోయారు. విద్యుత్ వెలుగులు వారిలో ఆనందాన్ని నింపాయి. ఈ క్రమంలోనే ఆ గ్రామస్థులు తమ గిరిజన ఆచారంలోని థింసా నృత్యం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
