విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జననాయగన్ ’. హెచ్. వినోద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాను జననాయకుడుగా తీసుకువస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు వెర్షన్‌లో వరల్డ్ వైడ్ గా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సిఉంది. సరిగ్గా రిలీజ్ కు ఒక రోజు ముందు సెన్సార్ టీమ్ జననాయగన్ కు షాక్ ఇచ్చింది. సినిమాలో కొన్ని సీన్స్ ను మ్యూట్ చేయాలనీ సూచించింది అందుకు ఒప్పుకొని మేకర్స్ సుప్రీమ్ కోర్టుకు వెళ్లారు. కానీ అక్కడ కూడా జననాయగన్ టీమ్ కు పరాభావం తప్పలేదు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని సూచించింది.
ఈ నేపథ్యంలో అసలు జననాయగన్ విడుదల కాదేమో అనే డౌట్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా ‘జననాయకన్’ సినిమా విడుదలపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ చిత్ర ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు ఫిబ్రవరి 6న సినిమా విడుదలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సమాచారం అందించారు. దీంతో ఓవర్సీస్ మార్కెట్లలో విడుదలకు సంబంధించి ప్రాథమిక సన్నాహాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా విడుదల పూర్తిగా ఈ రోజు వెలువడనున్న కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం న్యాయపరమైన అంశాలు పరిష్కార దశలో ఉండటంతో, తుది నిర్ణయం కోర్టు తీర్పు తర్వాతే స్పష్టతకు రానుంది.కోర్టు నుంచి అనుకూల తీర్పు వస్తే, నిర్ణీత తేదీ అయిన ఫిబ్రవరి 6న ‘జననాయకన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, ప్రతికూల తీర్పు వస్తే విడుదల తేదీలో మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి, ‘జననాయకన్’ సినిమా విడుదలపై అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఉత్కంఠగా రేపటి కోర్టు తీర్పును ఎదురుచూస్తున్నారు. ఆ తీర్పుతోనే ఈ సినిమా భవితవ్యం ఖరారుకానుంది.
