NTV Telugu Site icon

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై ఫిక్సింగ్ ఆరోపణలు.. ఐపీఎస్ అధికారికి 15 రోజుల జైలు శిక్ష..

Madras High Court

Madras High Court

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ లో 2013 సీజన్ సమయంలో ఫిక్సింగ్, బెట్టింగ్ కు పాల్పడినట్లు ఓ ఐపీఎల్ అధికారి ఆరోపణలు చేశాడు. అయితే, ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు నిర్థారణ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై రెండేళ్ల నిషేధం విధించారు. ఆ టైంలో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ నేతృత్వంలో విచారణ సాగింది. అయితే సంపత్ కుమార్ కొందరు బుకీల నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఆ అధికారిని కేసు విచారణ బాధ్యతల నుంచి ఉన్నతాధికారులు తప్పించారు. దీంతో బుకీల నుంచి సంపత్ కుమార్ లంచం తీసుకున్నట్టు ఆధారాలు లేవంటూ ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ అతడికి ఊరట లభించింది.

Read Also: Bussiness Idea : రోజుకు రెండు గంటలు కష్టపడితే చాలు.. లక్షల్లో ఆదాయం…

కానీ, సదరు ఐపీఎస్ అధికారి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహేంద్ర సింగ్ ధోనీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఓ టీవీ చానల్లో సంపత్ కుమార్ మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టుకు ధోని తెలిపాడు. ఆ మేరకు సదరు టీవీ ఛానల్ పైనా, ఐపీఎస్ అధికారిపై రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేశాడు ధోనీ.. అంతేకాదు, తాను అడిగే 17 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని తన పిటిషన్ లో అతడు పేర్కొన్నారు.

Read Also: No More Secrets: ‘నో మోర్ సీక్రెట్స్’ అంటూ లిప్‌లాక్‌తో రెచ్చిపోయిన జ్యోతి రాయ్!

ఇక, మహేంద్ర సింగ్ ధోనీ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ టీవీ ఛానల్ తో పాటు సంపత్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే సదరు టీవీ ఛానల్ ఇచ్చిన వివరణపై మద్రాస్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ధోనీ లాంటి ప్రముఖ క్రికెటర్ పై ఏదైనా వార్తలు ప్రసారం చేసే ముందు వాటిని నిర్ధారించుకోవాలని ఆ టీవీ ఛానల్ కు కోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో పాటు ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ వివరణ ధోనీ కోపాన్నీ తగ్గించలేకపోయింది. పైగా ఆయన ఇచ్చిన వివరణ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నాడంటూ ధోనీ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. ధోనీ పిటిషన్ పై ఇవాళ విచారణ చేసిన హైకోర్టు ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ కు 15 రోజుల జైలు శిక్ష విధించింది. అయితే అతడు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును 30 రోజులు నిలిపివేసింది.