Site icon NTV Telugu

Hero Vishal: హీరో విశాల్‌కు బిగ్ షాక్.. 30 శాతం వడ్డీతో 21 కోట్లు చెల్లించాలంటూ..!

Hero Vishal

Hero Vishal

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు 30 శాతం వడ్డీతో రూ.21 కోట్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రెండున్నర ఏళ్ల విచారణ అనంతరం లైకాకు వడ్డీతో పాటు రూ.21 కోట్లు చెల్లించాలని విశాల్‌ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. హీరో విశాల్, లైకా ప్రొడక్షన్స్ మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Also Read: Bengaluru Stampede: తొక్కిసలాటలో అమ్మాయిల బట్టలు చింపేశారు.. లైంగికంగా వేధించారు! వీడియో వైరల్

విశాల్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కు మధ్య కొన్నాళ్లకిత్రం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తాయి. సినిమా తీస్తాన‌ని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నార‌ని, డ‌బ్బు తిరిగి చెల్లించ‌లేదని 2022లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ మ‌ద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించింది. డబ్బు తిరిగిచ్చే వరకు విశాల్‌ నిర్మించే సినిమా హక్కుల్ని తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాల్‌ ‘వీరమె వాగై చూడమ్‌’ సినిమా హక్కులను లైకాకు బదులు వేరే సంస్థకు అమ్మేశాడు. దీంతో లైకా సంస్థ చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. చివరకు ఈరోజు తీర్పు ఇచ్చింది.

Exit mobile version