Site icon NTV Telugu

Samineni Ramarao Murder: సీపీఎం సీనియర్‌ నేత దారుణ హత్య.. స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి..

Bhatti

Bhatti

Samineni Ramarao murder: మధిర శాసనసభ నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీనియర్ నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురికావడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. కలుషిత హింస రాజకీయాలకు తావు లేదు అని డిప్యూటీ సీఎం అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ఖమ్మం పోలీసు అధికారులను హెచ్చరించారు. క్లూస్ టీం, శ్రీ ఫర్ డాగ్స్, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని మార్గాలను ఉపయోగించి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి అని డిప్యూటీ సీఎం ఆదేశించారు. సీనియర్ నేత సామినేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. రామారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, పూర్తిస్థాయిలో ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.

READ MORE: Kash Patel: చిక్కుల్లో ఎఫ్‌బీఐ చీఫ్.. ప్రియురాలి కోసం జెట్‌లో షికార్లు

అసలు ఏం జరిగింది..?
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సీపీఎం సీనియర్ నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది సామినేని రామారావుని గొంతు కోసి హత్య చేశారు. ఇంకొక మూడు రోజుల్లో సామినేని రామారావు మనవరాలు పెళ్లి ఖమ్మంలో నిశ్చయించారు. అయితే.. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు పొట్టనబెట్టుకున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కారణాలపై విచారణ చేపట్టనున్నారు. కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు రామారావు. పార్టీలో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు.

Exit mobile version