Madhya Pradesh : నేటి సమాజంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావివరుసలు మర్చిపోయి పశువుల కన్న హీనంగా ప్రవర్తిస్తున్నారు. తండ్రి కూతురు మీద, మామ కోడలు మీద, ఇంటి పక్కన ఉండే మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్నారు. కొన్ని చోట్ల అభంశుభం తెలియని చిన్నారులపై కూడా దాడులు చేసి కామవాంచలను తీర్చుకుంటున్నారు. కొన్ని ఘటనల్లో మహిళలు కూడా మగాళ్లకు మేం ఏం తక్కువ కాదంటూ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ సందర్భాల్లోనే పరస్పర దాడులు చోటు చేసుకుని.. నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్ లోని సియోని పరిధిలో ఈ ఘటన జరిగింది. భూత్ బంధాని గ్రామంలో సంజయ ధుర్వే, తన భార్య తండ్రి సంజయ్ తండ్రి దరోగ్ సింగ్ తో కలిసి నివసిస్తున్నారు. వీరంతా ఒక ఇంట్లోనే ఉండేవారు.
Read Also:Prabhas: ఆదిపురుష్ ఆల్ షోస్ హౌజ్ ఫుల్… అప్పుడే బోర్డు పెట్టేసారు
పెళ్లి తర్వాత.. తన తండ్రి పట్ల సంజయ్ అనుమానం పెంచుకున్నాడు. అంతే కాకుండా భార్యపై కూడా అనేక విషయాల్లో అనుమానంగానే మాట్లాడేవాడు. వీరి వ్యవహారం కూడా అలాగే ఉండేది. దీంతో వీరిపై అనుమానంతో కొడుకు తన తండ్రితో చాలా సార్లు గొడవలు పడ్డాడు. భార్యతో కూడా తనకు వాగ్వాదం జరిగింది. మరీ వీరి వ్యవహారం చేయిదాటడంతో సంజయ్ కోపంతో రగిలిపోయాడు. తన తండ్రి దరోగ్ సింగ్ ను మాట్లాడాలని చెప్పి ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అంతే కాకుండా.. అక్కడ గొడవ పడి తండ్రిని హతమార్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ సమయంలో అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక మరోవైపు.. సంజయ్ ధుర్వే భార్య కూడా తనను చంపుతాడనే భయంతో ఆత్మహత్య చేసుకుంది. దీనితర్వాత.. సంజయ్ తండ్రి, కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం బయటపడింది. ఈ క్రమంలోనే అతను తండ్రిని హతమార్చినట్లు సమాచారం. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also:Bus Driver : బస్ ఆపలేదని డ్రైవర్ ను ఉద్యోగం నుంచి తీసేసిన ఢిల్లీ ప్రభుత్వం
