Site icon NTV Telugu

MP: టెన్షన్‌.. టెన్షన్.. దర్గాపై హిందూ జెండా ఎగరేసిన దుండగులు..

Mp News

Mp News

Madhya Pradesh: దర్గాను ధ్వంసం చేశారు గుర్తుతెలియని దుండగులు. అంతటితో ఆగకుండా ముస్లిం ప్రార్థనా స్థలంపై హిందూ జెండా ఎగరేశారు. ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అంశంపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

READ MORE: Manda Krishna Madiga: పెన్షన్ పెంచుతావా గద్దె దిగుతావా? రేవంత్‌రెడ్డికి మంద కృష్ణ మాదిగ వార్నింగ్..

పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రేవా జిల్లాలోని గోర్గి గ్రామంలో శుక్రవారం రాత్రి కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు ఓ ముస్లిం ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశాయి. వారు ఆ దర్గా గోపురంపై మతపరమైన (హిందూ)జెండాను ఉంచారు. శనివారం ఉదయం ముస్లిం సమాజానికి ఈ విషయం తెలిసింది. దీంతో అక్కడికి జనాలు భారీగా తరలి వచ్చారు. అంశంపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని దెబ్బతిన్న దర్గా నిర్మాణ పనులను ప్రారంభించారు. గుర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గోర్గి గ్రామంలో ముస్లిం సమాజ విశ్వాసానికి ప్రతీక అయిన ఘాజీ మియా సమాధి ఇందులో ఉంది. ఇది చాలా పురాతనమైనది అని చెబుతారు. శుక్రవారం మధ్యాహ్నం ముస్లింలు ప్రార్థనలు సైతం చేశారు. అప్పటి వరకు అంతా బాగానే ఉందని చెబుతున్నారు. కానీ, రాత్రి సమయంలో కొంతమంది దుండగులు సమాధిని ధ్వంసం చేసి దానిపై మతపరమైన జెండాను ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version