MP: టెన్షన్.. టెన్షన్.. దర్గాపై హిందూ జెండా ఎగరేసిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: ఓ దర్గాను ధ్వంసం చేశారు గుర్తుతెలియని దుండగులు. అంతటితో ఆగకుండా ఆ ముస్లిం ప్రార్థనా స్థలంపై హిందూ జెండా ఎగరేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఈ అంశంపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: Manda Krishna Madiga: పెన్షన్ పెంచుతావా గద్దె దిగుతావా? రేవంత్‌రెడ్డికి మంద కృష్ణ మాదిగ వార్నింగ్..
Also Read
పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలోని గోర్గి గ్రామంలో శుక్రవారం రాత్రి కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు ఓ ముస్లిం ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశాయి. వారు ఆ దర్గా గోపురంపై మతపరమైన (హిందూ)జెండాను ఉంచారు. శనివారం ఉదయం ముస్లిం సమాజానికి ఈ విషయం తెలిసింది. దీంతో అక్కడికి జనాలు భారీగా తరలి వచ్చారు. ఈ అంశంపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని దెబ్బతిన్న దర్గా నిర్మాణ పనులను ప్రారంభించారు. గుర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గోర్గి గ్రామంలో ముస్లిం సమాజ విశ్వాసానికి ప్రతీక అయిన ఘాజీ మియా సమాధి ఇందులో ఉంది. ఇది చాలా పురాతనమైనది అని చెబుతారు. శుక్రవారం మధ్యాహ్నం ముస్లింలు ప్రార్థనలు సైతం చేశారు. అప్పటి వరకు అంతా బాగానే ఉందని చెబుతున్నారు. కానీ, రాత్రి సమయంలో కొంతమంది దుండగులు సమాధిని ధ్వంసం చేసి దానిపై మతపరమైన జెండాను ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!