Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Certificate: మధ్యప్రదేశ్‌లో ఆన్లైన్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ తీరును చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఏకంగా ఒక గాడిద పేరు మీద నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ అయిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులో పేరు, ఫోటో, తల్లిదండ్రుల వివరాలు, కులం.. ఇలా ప్రతీదీ కావాలని ఫేక్‌గా నింపినా కూడా సిస్టమ్ దానిని రిజెక్ట్ చేయలేదు సరికాదా, క్షణాల్లో సర్టిఫికేట్ కూడా ప్రింట్ చేసి చేతిలో పెట్టింది.
ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ నర్సెస్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ (MPNRC) ఆన్లైన్ పోర్టల్‌లో వెలుగు చూసింది. అసలు ఈ ఆన్లైన్ సిస్టమ్‌లో వివరాలను, డాక్యుమెంట్లను సరిగ్గా వెరిఫై చేస్తున్నారా లేదా అని టెస్ట్ చేయడానికి ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఓ ప్లాన్ వేశారు. అందులో భాగంగానే దరఖాస్తులో ఒక గాడిద ఫోటో పెట్టి, పేరు దగ్గర ‘డంకీ’ అని రాశాడు. చిత్రమేమిటంటే, ఎన్ని తప్పులు ఉన్నా కూడా ఆ అప్లికేషన్‌ను పోర్టల్ చాలా ఈజీగా ఆమోదించేసింది. ఆన్లైన్లో రూ.2,050 ఫీజు చెల్లించిన కొద్ది నిమిషాల్లోనే ఆ గాడిద పేరు మీద నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా జారీ అయిపోయింది. ఈ ఘటనతో ఆన్లైన్ పోర్టల్ భద్రత, డాక్యుమెంట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం నవ్వులపాలైంది.
Also Read
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
అసలు ఆ అప్లికేషన్లో రవి పర్మార్ ఏం నింపారో తెలిస్తే మరింత ఆశ్చర్యం వేస్తుంది. దరఖాస్తుదారుడి పేరు ‘డంకీ’, ఫోటో గాడిదది కాగా, తండ్రి పేరు ‘డంకీ ఫాదర్’, తల్లి పేరు ‘డంకీ మదర్’, కులం దగ్గర ఏకంగా ‘యానిమల్’ అని పెట్టారు. అడ్రస్ కూడా తప్పుగానే ఇచ్చారు. ట్రైనింగ్ సెంటర్ వివరాల్లో భోపాల్ నర్సింగ్ కాలేజ్, భోపాల్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (BMHRC) పేర్లు రాశారు. ఇక 10వ తరగతి, 12వ తరగతి మార్కులు, రోల్ నంబర్లు కూడా నకిలీవే ఇచ్చారు. ఇన్ని తప్పులున్నా పోర్టల్ ఏమాత్రం గుర్తుపట్టకుండా, ఫీజు కట్టగానే సర్టిఫికేట్ ఇచ్చేసింది.
ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం నడుపుతున్న అధికారిక పోర్టల్‌లోనే ఒక టెస్ట్ అప్లికేషన్ ఇలా సక్సెస్ అయిందంటే ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదని, నర్సింగ్ రిజిస్ట్రేషన్ల నమ్మకత్వానికే పెద్ద ముప్పు అని మండిపడ్డారు. రేపు ఆస్పత్రుల్లో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడేలా సర్టిఫికెట్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. అసలు నిజమైన అభ్యర్థుల డాక్యుమెంట్లను అసలు సరిగ్గా చెక్ చేస్తున్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే స్వతంత్ర సాంకేతిక, పరిపాలనా విచారణ జరిపించాలని, అసలు ఈ ఫేక్ అప్లికేషన్‌కు సర్టిఫికేట్ ఎలా జారీ అయిందో తేల్చాలని వారు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!